టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో మోస్ట్ అవైటెడ్‌గా తెరకెక్కిన పుష్ప 2 ఎలాంటి రిజల్ట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్‌లతో రికార్డులు క్రియేట్ చేస్తున్న ఈ సినిమా.. ఒక్క దెబ్బతో స్టార్లు, సూపర్ స్టార్ల రికార్డులను కూడా బ్లాక్ చేసి పడేసింది. ఆ రేంజ్ లో పుష్ప 2 ఫస్ట్ డే కలెక్షన్స్ తో విశ్వరూపం చూపించాడు బన్నీ.
మొదటిరోజు ఇండియా లెవెల్ లో రూ.180 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు కొలగోట్టిన పుష్ప 2.. ప్రపంచవ్యాప్తంగా రూ.250 కోట్లకు పైగా వసూలు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంతేకాదు సీడెడ్‌లోను పుష్పరాజ్ తన సత్తా చాటాడు. ప్రీమియర్, తొలి రోజు కలెక్షన్స్ తో కలిపి ఏకంగా రూ.13 కోట్లకు పైగా షేర్ వసూళ్లు అందుకోవడం అంటే అది సాధారణ విషయం కాదు. ఈ క్రమంలోనే పుష్ప 2 సెకండ్ డే కలెక్షన్స్ ఏ రేంజ్ లో కొల్లగొడుతుందో.. బన్నీ మరిన్ని రికార్డులు క్రియేట్ చేస్తాడో.. లేదో.. అని ఆసక్తి అభిమానులలో నెలకొంది.
ఇక ఈ సినిమా సెకండ్ కలెక్షన్స్ విషయంలో కాస్త వెనకపడిందని.. బుకింగ్స్ లోను సగానికి పైగా తగ్గిపోయాయంటూ వార్తలు వినిపించాయి. ఈ క్రమంలోనే రెండో రోజు సినిమా ఇండియా వైడ్‌గా రూ.100 కోట్లకు పైగా రాబట్టే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఓవర్సీస్‌తో కలిపి.. ప్రపంచ వ్యాప్తంగా రూ.150 కోట్ల వరకు కలెక్షన్లు రావచ్చట. ఇక పుష్ప గాడు సెకండ్‌డే కలెక్షన్లతో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో.. సరైన లెక్కలు తెలియాలంటే మరి కొంత సేపు వేచి చూడాల్సిందే.