టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన మధ్య ఎఫైర్ ఉంది అంటూ ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్నారంటూ వార్తలు కూడా వినిపించాయి. గతంలో వీరి కాంబినేషన్‌లో గీతగోవిందం, డియర్ కామ్రేడ్ రెండు సినిమాలు సినిమాలు తెరకెక్కగా.. పరుశురాం డైరెక్షన్‌లో తెరకెక్కిన గీత గోవిందం సూపర్ డూపర్ హిట్‌గా గెలిచింది. అంతేకాదు విజయ్‌కి తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసిన సినిమాలో ఇది ఒకటి. ఇక అప్పటి నుంచి విజయ, రష్మిక మధ్య ప్రేమ ఉందని.. వీరిద్దరూ ఎఫైర్ నడుపుతున్నారు అంటూ వార్తలు వినిపించాయి.
ఇక ఈ సినిమాలో వీరికి కెమిస్ట్రీ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే ఈ కపుల్‌కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. సోషల్ మీడియాలోనూ, జనరల్ మీడియాలోనూ వీరిద్దరు ప్రేమించుకుంటున్నారు అంటూ.. ఇప్పటికే ఎన్నో వార్తలు వినిపించాయి. వీరిద్దరూ ప్రైవేట్ గా వెకేషన్లకు వెళ్ళిన ఫోటోలు.. అలాగే ఇద్దరు కలిసి రెస్టారెంట్‌లో డిన్నర్ చేస్తున్న ఫోటోలు కూడా నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక తాజాగా రష్మిక నటించిన పాన్ ఇండియా సినిమా పుష్ప 2 రిలీజ్ వేళ.. వార్తలకు మరింత బలం చేకూరింది. విజయ్ దేవరకొండతో.. తన బంధాన్ని రష్మిక మరింత స్ట్రాంగ్ గా చేసుకున్నట్లు క్లియర్‌గా అర్థమవుతుంది.
విజయ్ దేవరకొండ ఫ్యామిలీ మొత్తంతో కలిసి.. రష్మిక పుష్ప 2 సినిమాను ఎంజాయ్ చేసింది. హైదరాబాద్‌లోని.. మహేష్ బాబు ఏఎంబి మాల్‌లో రష్మిక.. విజయ్ తల్లి మాధవి, సోదరుడు ఆనంద్ దేవరకొండతో పుష్ప 2 సినిమా కలిసి చూసింది. అయితే వీళ్ళతో విజయ్ రాలేదు. అయితే పుష్ప 2 రిలీజ్‌తో.. విజయ్‌తోనే కాదు ఆమె ఫ్యామిలీతోనూ ఈమె బంధం మరింత బలపడిందని ఆడియన్స్ కు అర్థమైంది. ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ తన 12వ సినిమా షూట్‌లో బిజీగా గడుపుతున్నాడు.