పుష్ప 2 డైలాగ్స్ మేటర్ లో ఆ పార్టీ ఓవరాక్షన్.. ఫ్యాన్స్ భలే షాక్ ఇచ్చారుగా..

పుష్ప ది రూల్ మూవీ తాజాగా రిలీజైన సంగ‌తి తెలిసిందే. అయితే సినిమా రిలీజ్ డేట్ కంటే ముందు రోజు రాత్రి 9 గంట‌ల నుంచే బెనిఫిట్ షోలు వేశారు. ఈ క్ర‌మంలోనే బెనిఫిట్ షోస్ ముగిసిన‌ వెంటనే.. సోషల్ మీడియాలో కొన్ని మూవీ డైలాగ్స్ తెగ వైరల్‌గా మారాయి. కాగా ప్ర‌స్తుతం ఆ డైలాగ్స్‌ను వైసీపీ నేతలు తెగ‌ వైరల్ చేస్తున్నారు. మెగా, బన్నీ కుటుంబాల‌కి మధ్య గ్యాప్ ఉన్న క్ర‌మంలో మెగా కుటుంబాని కించపరిచేలా కొన్ని డైలాగ్స్ ఉన్నాయంటూ సోషల్ మీడియాలో ఆ డైలాగ్‌ల‌ను వైరల్ చేస్తున్నారు.

కాగా నిజంగానే సినిమాలో అలాంటి డైలాగ్స్ ఉన్నాయా అంటే మాత్రం లేవనే చెప్పాలి. ఇలాంటి క్రమంలో పుష్ప 2 డైలాగులు నెగటివ్ గా ఎక్స్‌పోజ్‌ చేస్తూ.. వైసీపీ తెగ ఓవరాక్షన్ చేస్తుందంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెగటివ్ ప్రచారం చేసే వాళ్లపై తిరిగి ట్రోల్స్‌ చేస్తూ బన్నీ ఫ్యాన్స్ వాళ్ళ‌కి షాక్ ఇస్తున్నారు. నెగటివ్ ప్రచారాలకు తమదైన స్టైల్ తో చెక్ పెట్టేలా అడుగులు వేస్తున్నారు.

ఇక పుష్ప 2 ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ సినిమా.. కలెక్షన్ల‌ పరంగా పాన్ ఇండియా లెవెల్లో రూ.175కోట్ల వ‌సూళ్ళు సాధించింది. ఇక సీడెడ్ లో 4.2 మిలియన్ డాలర్ల కలెక్షన్లు కలగొట్టిందని సమాచారం. ఇలా ఫస్ట్ డే కలెక్షన్లతోనే రికార్డులు కల్లగొట్టిన ఈ సినిమా.. బుక్ మై షో వెబ్సైట్‌లోనూ ఎన్నో రికార్డులను సొంతం చేసుకుంది.