పుష్ప 2 బెనిఫిట్ షో ఎఫెక్ట్.. సీఎం రేవంత్ రెడ్డి షాకింగ్ డెసిషన్..!

ఇకపై తెలంగాణ గవర్నమెంట్ బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చేది లేదంటూ షాకింగ్ డెసిష‌న్ తీసుకున్నారు. ఈ విష‌యాని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అఫీషియల్ గా ప్రకటించారు. ఇంత స‌డ‌న్‌గా ప్ర‌భుత్వం అలాంటి డెసిష‌న్ తీసుకోవ‌డేమిటి అస‌లేం జ‌రిగిందో ఒక‌సారి చూద్దాం. అల్లు అర్జున్ హీరోగా, ర‌ష్హిక మంద‌న హీరోయిన్‌గా, సుకుమార్ డైరెక్షన్‌లో తెర‌కెక్కిన పుష్ప 2 తాజాగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఎప్పుడెప్పుడా అంటూ పాన్ ఇండియా లెవెల్ ప్రేక్షకులంతా ఆశ‌క్తిగా ఎదురుచూసిన పుష్ప 2 తాజాగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.

Mother dead, son critical following Pushpa 2 premiere stampede

డిసెంబర్ 5న రిలీజ్ అయిన ఈ సినిమాకు డిసెంబర్ 4 రాత్రి 9:30 నుండి బెనిఫిట్ షోలో ప్రారంభమయ్యాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు.. పలు ప్రాంతాలలో బెనిఫిట్ షోలు ప్రదర్శించారు. కాగా.. ఈ బెనిఫిట్‌షో నేప‌ద్యంలో తెలంగ‌ణలో హైర‌రాబిద్‌లో ఓ దుర్ఘ‌ట‌న చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. సంధ్య థియేటర్‌లో పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసులాటలో రేవతి (39) ఏళ్ల మహిళా మృతి చెందింది. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమయింది.

BJP leader approached me seeking Cabinet berth, says Congress' Komatireddy  Venkata Reddy - The Hindu

ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వబోమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అఫీషియల్‌గా ప్రకటించారు. హైదరాబాద్ సంధ్య థియేటర్‌లో పుష్ప 2 బెనిఫిట్‌ షోకి అల్లు అర్జున్ వచ్చి సందడి చేసిన సంగతి తెలిసిందే. ఆయన్ని చూసేందుకు వేలాది మంది ప్రేక్షకులు ఏగ‌బడడంతో భారీ తొక్కేసులాట జరిగింది. ఈ క్రమంలోనే మహిళా చనిపోయింది. అంతేకాదు.. 9 ఏళ్ల ఆమె కొడుకు కూడా తీవ్రంగా గాయాల పాలయ్యాడు. ప్రస్తుతం ఆ బాబు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. తాజాగా దీనిపై పుష్ప 2 మేకర్స్ రియాక్ట్ అయ్యారు. వారి కుటుంబానికి అండగా నిలుస్తామంటూ సోషల్ మీడియా వేదికగా మైత్రి మూవీ మేకర్స్ పేజ్ పై అఫీషియల్‌గా ప్రకటించారు.