ఇది పుష్ప గాడి రూలింగ్… తొలి రోజు వ‌ర‌ల్డ్ వైడ్ వ‌సూళ్ల విధ్వంసం…!

పుష్పరాజ్ మాస్‌ జాతర మొద‌లైంది. ఎప్పుడెప్పుడా అంటూ ప్రేక్షకులంతా వేయికళ్లతో ఎదురుచూసిన టైం రానే వచ్చింది. తాజాగా పుష్ప 2 రిలీజై ప్రేక్షకులను విప‌రీతంగా ఆకట్టుకుంటుంది. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ టాక్‌ను సంపాదించుకుని దూసుకుపోతున్న ఈ సినిమా.. పార్ట్ 1ను మించే రేంజ్ లో అదరగొట్టింది. దీంతో బన్నీ ఫ్యాన్స్ అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాతో సరికొత్త రికార్డులను క్రియేట్ చేయడం ఖాయమంటూ అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బన్నీ హీరోగా, రష్మిక మందున హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కాగా.. ముందు రోజు అంటే డిసెంబర్ 4 రాత్రి 9:30 నుంచి ప్రీమియర్ షోలు పడ్డాయి. ఆ ప్రీమియర్స్ ముగిసే స‌మ‌యానికి మూవీ బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో.. ఫస్ట్ డే వసూళ్లపై ఆ ప్రభావం కనిపించింది.

Allu Arjun's Team, Pushpa Filmmakers Respond Over Woman's Death Incident At Sandhya  Theater | Times Now

ఈ క్రమంలోనే ఫస్ట్ డే పుష్ప 2 ఎలాంటి రికార్డును క్రియేట్ చేశాడు.. ఏ రేంజ్ లో వ‌సూళ్ళు సాధించాడు తెలుసుకోవాలని ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. అయితే పుష్పరాజ్ ఫస్టే డే కలెక్షన్స్ ఇప్పటివరకు వచ్చిన అన్ని సినిమాల రికార్డులను బద్దలు కొట్టాయి. అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే రూ.100 కోట్లు వసూళ్ళు చేసిన ఈ సినిమా.. రిలీజ్ తర్వాత ఫస్ట్ డే భారీగా కలెక్షన్లు కొల్లగొట్టిందట. డిసెంబర్ 5న పుష్ప 2 రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. కాగా.. డిసెంబర్ 4న రిలీజ్ అయిన ప్రీమియర్ షోలకు రూ.10 కోట్లు రాబట్టగా.. డిసెంబర్ 5న మూవీ రిలీజై ఏకంగా రూ.165 కోట్ల వసూళ్లను సాధించిందని తెలుస్తుంది. దీంతో ప్రీమియర్ షోలతో కలుపుకొని మొత్తంగా రూ.175 కోట్ల కలెక్షన్లు వచ్చాయట. వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ లెక్కలు కలుపుకుంటే.. పుష్ప కలెక్షన్ లెక్క దాదాపు రూ.250 కోట్ల వరకు చేరే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.

Allu Arjun's 'Pushpa 2' release delayed, to reach theatres on December 6

ఇక రాజమౌళి డైరెక్షన్‌లో తెర‌కెక్కి పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన ఆర్‌ఆర్ఆర్.. మొదటి రోజు రూ.133 కోట్ల కలెక్షన్లు కల్లగొట్టగా, బాహుబలి రూ.121 కోట్లు, కేజీఎఫ్ రూ.116 కోట్ల వసూళ్లను సాధించాయి. ఈ రికార్డ్‌లు అన్నిటిని ఇప్పుడు పుష్పరాజ్ పట్టా పంచలు చేశాడని టాక్ నడుస్తుంది. పుష్ప 2 కు హైదరాబాద్‌లో 1549 షోలు పడగా.. కర్ణాటకలో 1072 షోలు పడ్డాయి. చెన్నైలో 204 షోలు ప్రదర్శించారు. ఫస్ట్ డే మొత్తం రూ.175 కోట్లు రాగా.. తెలుగు వర్షన్ నుంచే రూ.95.1 కోట్లు, హిందీ నుంచి రూ.67 కోట్లు వచ్చినట్లు సమాచారం. ఇక తమిళనాడులో రూ.7 కోట్లు, మలయాళంలో రూ. 5కోట్ల కలెక్షన్లను పుష్పరాజ్ కొల్లగొట్టాడట. కన్నడ వర్షన్‌ నుంచి.. ఫస్ట్ డే రూ.1 కోటి రూపాయల వసూలు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ముందు ముందు పుష్పరాజ్ కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉండవున్నాయో.. ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి.