టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన నాలుగో సినిమా పుష్ప 2. ఈ మూవీ కోసం తెలుగు ప్రేక్షకులే కాదు.. పాన్ ఇండియా లెవెల్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన సంగతి తెలిసిందే. పుష్ప పార్ట్ 1 తో పాన్ ఇండియా లెవెల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న అల్లు అర్జున్.. ఈ సినిమాతో ఒక్కసారిగా తన మార్కెట్‌ను పీక్స్ లెవెల్‌కు తీసుకువెళ్ళాడు. ఇక టాలీవుడ్ ప్రేక్షకుల కంటే ఎక్కువగా నార్త్ ఆడియన్స్ పుష్ప మేనరిజానికి ఫిదా అయ్యారు.
ఈ క్రమంలోనే పుష్ప 2 సినిమాపై రిలీజ్ కు ముందే ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. అంతేకాదు నార్త్‌లో ఈ అంచనాలకు తగ్గటు పుష్ప 2 కు భారీ ప్రి రిలీజ్ బిజినెస్ కూడా జరిగింది. కాగా తాజాగా ఐకాన్ స్టార్ నర్త్‌లో మరోసారి సత్తా చాటాడంటూ.. హిందీలో తెలుగోడి ఆల్ టైం రికార్డ్ అంటూ.. ఓ న్యూస్ నెటింట వైరల్‌గా మారుతుంది. ఇంతకీ మ్యాటర్ ఏంటో ఓసారి చూద్దాం. పాన్ ఇండియా లెవెల్ లో బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమాకు.. గతంలో రూ.65 కోట్లకు పైగా నెట్ వసూళ్ళు వచ్చిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు అలాంటి బ్లాక్ బస్స్టార్ రికార్డ్ ను పుష్ప 2 బ్రేక్ చేసిందని తెలుస్తుంది. తాజాగా రిలీజ్ అయిన పుష్ప 2కు కేవలం నార్త్‌లోనే రూ.67 కోట్లకి పైగా నెట్ వసూళ్ళు వచ్చాయని.. ఈ క్రమంలోనే ఇప్పటివరకు హైయస్ట్ వసూళ్ళు అందుకున్న జవాన్ రికార్డును పుష్పరాజ్ బ్రేక్ చేశాడని తెలుస్తుంది. హిందీలో పుష్పరాజ్ ఆల్ టైం రికార్డ్ ను సెట్ చేశాడంటూ ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో పుష్ప 2 దెబ్బతో హిందీలో తెలుగు హీరోకి ఆల్ టైం రికార్డ్ క్రియేట్ అయింది.