అల్లు అర్జున్. సుకుమార్ కాంబోలో తెరకెక్కిన నాలుగో మూవీ పుష్ప 2. రిలీజ్‌కు ముందే ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను నెలకొల్పిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా నేడు గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు నిన్న రాత్రి 9 గంటల నుంచి ప్రీమియర్ షోలు మొదలైపోయాయి. సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో.. బీభత్సమైన కలెక్షన్లు కొల్లగొడుతూ దూసుకుపోతుంది. కాగా నిన్న రాత్రి జరిగిన మిడ్ నైట్ షోకు.. బన్నీ, తన కుటుంబంతో కలిసి అభిమానులతో సినిమా చూడాలని సంధ్య థియేటర్స్ కు వెళ్లి సందడి చేశాడు.
బన్నీ వస్తున్నాడు అని తెలియడంతో అక్కడ అభిమానులంతా భారీ ఎత్తున పోటెత్తారు. ఇక వారిని కంట్రోల్ చేయడం పోలీసుల తరం కూడా కాలేదు. ఈ క్రమంలోనే వారిపై లాఠీ ఛార్జ్ మొదలుపెట్టారు. కానీ అప్పటికే దుర్ఘటన జరిగిపోయింది. బన్నీ కోసం ఎగబడుతున్న క్రమంలో జనాల మధ్యన జరిగిన తొక్కేసులాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. తాజాగా.. ఈ ఇన్సిడెంట్‌పై పుష్ప 2 మూవీ ప్రొడ్యూసర్స్ రియాక్ట్ అయ్యారు. నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తన సోషల్ మీడియా వేదికగా రెస్పాండ్ అవుతూ.. నిన్న రాత్రి జరిగిన ఈ సంఘటనకు మేము చాలా చింతిస్తున్నాం.. ఆ ఫ్యామిలీ, చికిత్స చేపించుకుంటున్న ఆ అబ్బాయి కోసం మేము ప్రార్థనలు చేస్తూనే ఉన్నాం.. మేము చాలా బాధపడుతున్నాం.. అలాంటి క్లిష్ట సమయంలో కుటుంబానికి మేము అండగా నిలబడతాం అంటూ పోస్ట్ ను షేర్ చేసుకున్నారు.
దిల్‌షుక్‌నగర్‌లో నివాసం ఉండే రేవతి, భాస్కర్ భార్యాభర్తలకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే వాళ్ల కొడుకు శ్రీ తేజకు బన్నీ అంటే మహా ఇష్టం. పుష్పకు వీరాభిమాని. ఈ క్రమంలోనే పుష్ప 2ను మొదటి రోజు చూసేందుకు భాస్కర్.. భార్య, కూతురు, కొడుకులని తీసుకుని ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్స్ కు వెళ్లారు. అక్కడ జరిగిన సంఘటనతో భార్యని కోల్పోయాడు భాస్కర్. ప్రస్తుతం కొడుకు పరిస్థితి కూడా క్రిటికల్ గానే ఉంది. ఇలాంటి క్రమంలో మేకర్స్ రియాక్ట్ అవుతూ మేము కూడా అండగా నిలబడతాం అంటూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించడంతో.. ఈ పోస్ట్ నెటింట వైరల్‌గా మారుతుంది.