టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది సినీ ప్రముఖులు, హైదరాబాద్ వాసులు, సినీ ప్రియులు ఇష్టంగా సినిమాలు చూడడానికి వెళ్లే థియేటర్లలో ప్రసాద్ మల్టీప్లెక్స్ మొదటి వరుసలో ఉంటుంది. ఈ థియేటర్లో సినిమాటిక్ అనుభూతిని పొందేందుకు ఆడియన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఇలాంటి క్రమంలోనే తాజాగా రిలీజ్ అయిన పుష్ప ది రూల్.. ఇందులో చూడాలని ఎంతోమంది ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే సినీప్రియలను నిరాశపరిచే ఓ న్యూస్ తాజాగా ప్రసాద్ మల్టీప్లెక్స్ అఫీషియల్‌గా ప్రకటించారు.
ఈ సినిమాని తాము ప్రదర్శించడం లేదని.. ప్రసాద్ మల్టీప్లెక్స్ టీం ప్రకటించారు. ఈ మేరకు గురువారం ఉదయం ఎక్స్ వేదికగా పోస్ట్ షేర్ చేసుకున్న యాజమాన్యం.. సినీ ప్రియులకు అత్యుత్తమమైన సినిమాటిక్ ఎక్సపీరియన్స్ అందుబాటులో ఉంచడమే లక్ష్యంగా రెండు దశాబ్దాలుగా మేము పనిచేస్తున్నాం.. దురదృష్టవశాత్తు కొన్ని అనివార్య కారణాలతో మీకు ఎంతో ఇష్టమైన ప్రసాద్ మల్టీప్లెక్స్ లో.. పుష్ప 2ని ప్రదర్శించలేకపోతున్నాం అంటూ రాసుకొచ్చారు. మీకు అసౌకర్యం కల్పించినందుకు చింతిస్తున్నామని పేర్కొన్నారు. మమ్మల్ని కాస్త అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం.. మీ ప్రేమాభిమానాలు ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని భావిస్తున్నాం అంటూ ప్రసాద్ మల్టీప్లెక్స్ టీం రాసుకొచ్చారు.
కాగా అసలు పుష్ప 2 సినిమాని ప్రదర్శించకపోవడం వెనక కారణాలు మాత్రం చెప్పలేదు. ప్రస్తుతం ప్రసాద్ మల్టీప్లెక్స్ టీం చేసిన ఈ పోస్ట్ నెటింట వైరల్‌గా మారుతుంది. ఈ క్రమంలోనే దేశం మొత్తం పుష్ప 2 రచ్చ కొనసాగుతుంటే.. హైదరాబాదులో భారీ పాపులారిటీ తెచ్చుకున్న ప్రసాద్ మల్టీప్లెక్స్ మాత్రం.. పుష్ప 2 సినిమాను ప్రదర్శించకుండా మూగ పోవడం ఏంటి.. అసలు ఏం జరుగుంటుంది అనే సందేహాలు మొదలయ్యాయి. ఈ నేపద్యంలో దీని వెనుక అసలు కారణాలు ఏంటో తెలుసుకోవాలని ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలైంది.