కర్ణాటకలో పుష్ప 2 మిడ్ నైట్ షోస్ క్యాన్సిల్.. కారణం రష్మికానేనా..?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా నటించిన తాజా మూవీ పుష్ప 2. మోస్ట్ అవైటెడ్ మూవీగా రిలీజ్‌కు ముందు ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను నెలకొల్పిన ఈ సినిమా.. తాజాగా గ్రాండ్ లెవెల్లో ఆడియన్స్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు నిన్న రాత్రి 9:30 నుంచే ప్రీమియర్ షో, మిడ్‌నైట్ షోస్‌ పడిపోయాయి. తెల్లవారుజాము కల్లా సినిమాల రివ్యూలు కూడా నెటింట వైరల్‌గా మారాయి. అయితే అన్ని చోట్ల మిడ్‌నైట్ షోలు సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసిన పుష్ప 2.. కేవలం కర్ణాటక రాష్ట్రంలో మాత్రం మిడ్ నైట్ షోలను సడన్గా క్యాన్సిల్ చేసి.. టీంకు షాక్ ఇచ్చింది. చట్ట ప్రకారం మిడ్ నైట్ షోస్ విరుద్ధమని.. మిడ్ నైట్ షోలను తొలగించింది కర్ణాటక గవర్నమెంట్.

అయితే ఇప్పటివరకు రిలీజైన‌ అన్ని సినిమాలకు ఈ మిడ్‌నైట్ షోలు రద్దు అనే రూల్ వర్తించలేదా. కానీ.. కేవలం పుష్ప 2 విషయంలో మాత్రమే మిడ్ నైట్ షోలు ఎందుకు క్యాన్సిల్‌ చేశారు.. అనేదానిపై ఓ ఇంట్రెస్టింగ్ బ‌జ్ వైర‌ల్‌గా మారుతుంది. దానికి కారణం పుష్పరాజ్ భార్య శ్రీవల్లి.. అంటే రష్మిక మందన అని అంటున్నారు. వాట్‌.. రష్మిక కారణమేమిటి అనుకుంటున్నారా.. కన్నడ స్టార్ హీరో, కం డైరెక్టర్ రిషిప్ శెట్టి నటించిన కాంతారా సినిమా పెద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి రష్మిక కి గ‌తంలో ప్రశ్న ఎదురుకాగా.. నేను ఆ సినిమా చూడలేదు. నాకు తెలియదు అనేలా సమాధానం చెప్పిందట.

Pushpa 2: Allu Arjun's Jatara scene sets internet on fire; Rashmika  Mandanna impresses netizens

దీంతో కన్నడిగులు రష్మిక పై ఫైర్ అయ్యారని.. ఎందుకంటే రష్మిక ఇండస్ట్రీకి వచ్చిందే రిషబ్ శెట్టి ద్వారా.. అలాంటిది తనని ఇండస్ట్రీకి పరిచయం చేసిన వ్యక్తి సినిమా అంత గొప్ప సక్సెస్ అందుకుంటే.. ఆ సినిమా తెలియదని చెప్పడం కన్నడ ప్రేక్షకులకు కోపం తెప్పించిందని.. దీంతో కన్నడ ఇండస్ట్రీలో రష్మి కనీ బ్యాన్ చేయాలని ఫిక్స్ అయ్యారని.. ఆ కోపంతోనే రష్మిక నటించిన పుష్ప 2 సినిమా మిడ్ నైట్ షోలు రద్దు చేయించారని.. అక్కడ ఇండస్ట్రీలో టాక్ వైరల్ గా మారింది. దీంతో పాటే తాజాగా ఓ కన్నడ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు ఇవ్వలేదు. దీంతో ఈ కోపంతోనే పుష్ప 2 మిడ్ నైట్ షోలు కన్నడిగులు రద్దు చేశారని వార్తలు వైరల్ అవుతున్నాయి. అలా ఇప్పటివరకు కావాలనే కన్నడీగులు పుష్ప 2 సినిమాపై రివేంజ్ తీర్చుకుంటున్నారట.