పాన్ ఇండియా లెవెల్‌లో మోస్ట్ ఏవైటెడ్ మూవీగా రూపొందిన పుష్ప 2కి ప్రస్తుతం పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. రిలీజ్‌కు ముందు ఆడియన్స్ పెట్టుకున్న అంచనాలన్నింటిని అందుకుంటూ పుష్ప 2 పీక్స్ లెవెల్‌లో ప్రభంజనం సృష్టిస్తుంది. నిజానికి మొదట పుష్ప సినిమాకు ఈ రేంజ్లో అది కూడా ఇంత తక్కువ టైంలో బజ్ క్రియేట్‌కాలేదు. అలాంటిది.. పుష్ప 2 ప్రీమియర్ షో తోనే ఈ రేంజ్ లో పాజిటివ్ టాక్ రావడంతో సినిమా ఎలాగైనా చూడాలని మరింత మంది ఆడియన్స్ కు ఆసక్తి నెలకొంది. అయితే ఈ సినిమాలో గంగమ్మ జాతర ఎపిసోడ్ హైలైట్ అంటూ ఇప్పటికే ఎన్నో అభిప్రాయాలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. కానీ.. గంగమ్మ జాతర ఎపిసోడ్ని ఓ ఏరియాలో మాత్రం ట్రిమ్ చేసి రిలీజ్ చేయాల్సి వచ్చిందట.
ఇంతకీ ఆ ప్రాంతం ఏంటో.. అసలు దానిని ట్రిమ్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో.. ఒకసారి చూద్దాం. పాన్ ఇండియాలో పుష్ప 2 రన్‌టైం దాదాపు 3గం..ల 20 నిమిషాలు ఉంటే.. సౌదీ అరేబియాలో రన్‌టైం ఏకంగా 19 కట్ చేశారట. సౌదీ అరేబియా సెన్సార్ బోర్డ్.. జాతర ఎపిసోడ్ ట్రిమ్ చేసినట్లు సమాచారం. పుష్ప 2 సినిమా.. జాతర ఎపిసోడ్ 3 గంటల 1 నిమిషం నడివితోనే రిలీజ్ అయింది. పుష్ప 2లో కొన్ని కట్స్ తర్వాత అక్కడ సినిమా రిలీజ్‌ను అంగీకరించారు. ఇక గతంలోనూ సౌదీ అరేబియా సెన్సార్ బోర్డ్ చాలా బాలీవుడ్ సినిమాలను కూడా ట్రిమ్ చేసింది. అలాగే నచ్చకపోతే బ్యాన్ చేసిన సినిమాలు ఉన్నాయి.
కాగా.. తాజాగా పుష్ప 2 విషయానికి వచ్చేసరికి.. జాతర ఎపిసోడ్లో బన్నీ వేసిన అమ్మ వారి గెటప్ ని సెన్సార్ బోర్డ్ అభ్యంతరం చెందిందని.. హిందూ దేవతల పేర్లను రిఫరెన్స్ చేయడంతో సెన్సార్ కట్ చేశారని.. మల్టిపుల్ కట్స్ తో 19నిమిషాల నడివి తగ్గించి సెన్సార్ సర్టిఫికెట్ అందించారని తెలుస్తుంది. ప్రస్తుతం సౌదీ అరేబియాలో 19 నిమిషాల్లో సీన్ కట్ చేసి రిలీజ్ చేశారని తెలియడంతో అంత ఆశ్చర్యపోతున్నారు. అసలు సినిమాకే హైలెట్ జాతర సీన్. టైం అవుతున్నట్లు కూడా తెలియకుండా 20 నిమిషాలు చిటుకున్న గడిచాయి. సెకండ్ హాఫ్ కు అదే బలాన్ని ఇచ్చింది అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.