టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నుంచి తాజాగా వచ్చిన మోస్ట్ ఎవైతెద్ మూవీ పుష్ప 2. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రీమియర్ షోస్ నిన్న రాత్రి 9:30 నుంచే రిలీజ్ అయ్యాయి. హైదరాబాద్ తో పాటు ఆంధ్ర లోను ఎన్నో థియేటర్స్ లో పుష్ప అభిమానుల్లో సందడి నెలకొంది. అల్లు అర్జున్ నుంచి దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో రిలీజ్‌కు ముందు నుంచే విపరీతమైన అంచనాలను నెలకొన్నాయి. ఈ సినిమా టికెట్స్ కూడా బుకింగ్స్ ఓపెన్ అయిన క్షణాల్లోనే హాట్ కేకులా అమ్ముడుపోయాయి.
ఈ క్రమంలోనే రిలీజ్‌కు ముందే ఎన్నో రికార్డులను క్రియేట్ చేసిన పుష్ప 2 తాజాగా థియేటర్స్‌లోకి వచ్చి.. వారి అంచనాలకు తగ్గట్టుగానే బ్లాక్ బస్టర్ టాక్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో సినిమాను చూడాలని ఆసక్తి ప్రేక్షకుల్లో మరింతగా పెరిగింది. అయితే నిన్న ప్రిమియర్ షో రిలీజైన హైదరాబాద్ సంధ్య ధియేటర్స్‌లో భార్య స్నేహా రెడ్డితో పాటు, హీరోయిన్ రష్మికతో కలిసి సినిమాను వీక్షించేందుకు వెళ్థాడు. కాగా మూవీ పూర్తై అల్లు అర్జున్ బయటకు రావడంతో ఆయనను చూడడానికి జనం ఎగబడ్డారు. ఈ క్రమంలోనే భారీ తొక్కీసులాట జరిగింది. అందులో భాగంగా అల్లు అర్జున్‌ను చూసేందుకు వచ్చినా ఆయన డైహార్ట్ ఫ్యాన్ అయినా ఓ మహిళ (రేవతి 39) అక్కడ జరిగిన తొక్కేసిలాటలో మృతి చెందింది.
ఈ క్రమంలో సంఘటనకు అల్లు అర్జున్, పోలీసులు, నిర్మాతలే బాధ్యత వహించాలంటూ.. కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో పిటిషన్లు దాఖలు చేశాడు. మృతురాలి కుటుంబానికి రూ.10 కోట్ల నష్ట పరిహారం ఇప్పించాలని.. అసలు రాత్రిపూట బన్నీకి అక్కడికి వచ్చి సినిమా చూడాల్సినంత అవసరం ఏముందని.. పైగా వచ్చినవాడు వెళ్లిపోకుండా బహిరంగంగా రోడ్ పై అంతసేపు ఆగడంతో జనం ఆయన కోసం ఎగబడ్డారని.. దీనికి తగ్గిన శిక్ష అల్లు అర్జున్ కు వేయాలని.. ఆయన్ను అరెస్ట్ చేసి తీరాలి అంటూ బక్క జడ్సన్ వెల్లడించాడు. ప్రస్తుతం ఈ న్యూస్ నెటింట వైరల్‌గా మారుతుంది.