టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2.. థియేటర్స్‌లో రిలీజై బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. రిలీజ్‌కు ముందు విపరీతమైన అంచనాలను క్రియేట్ చేసిన ఈ సినిమా.. రిలీజ్ అయిన తర్వాత కూడా అదే రేంజ్ లో సక్సెస్ అందుకుంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను పుష్ప 2 విపరీతంగా ఆకట్టుకుంటుంది. అయితే సినిమా టికెట్స్ పెంపు విషయంలో ఇప్పటికే పలు విమర్శలను ఎదుర్కొన్న పుష్ప 2 మేకర్స్.. ఏమాత్రం టికెట్ రేట్లను తగ్గించడానికి మాత్రం ఇష్టపడలేదు.
భారీ బడ్జెట్ తో.. నిర్మాణ విలువలకు ఎక్కడా లోటు కలుగుకుండా ఎంత ప్రతిష్టాత్మకంగా రూ.500 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి సినిమాలు తెరకెక్కించామని వారి అభిప్రాయం. ఈ సినిమా ఆడియన్స్ను మెప్పించడం ఖాయం అని.. సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందంటూ మేకర్స్ తో పాటు మూవీ టీమ్ అంతా నమ్మకాన్ని వ్యక్తం చేశారు. అంతేకాదు సినిమాకు కూడా పాజిటివ్ టాక్ రావడంతో సినిమా మరింత ఊపు అందుకుంది. టికెట్ల బుకింగ్స్ మరింత వేగవంతం అవుతాయని.. పుష్పరాజ్ టార్గెట్ ను రీచ్ అవ్వడం మరింత సులభం అంటూ నెటిజన్లు తమ అభిప్రాయాలను కూడా వ్యక్తం చేశారు.
ఇలాంటి క్రమంలో మేకర్స్ కు భారీ షాక్ తగిలింది. సినిమా రిలీజై కనీసం 24 గంటలు కూడా కాకముందే.. పలు ఆన్లైన్ సైట్లలో పైరసీ కాపీ వచ్చేసింది. పుష్పగాడి ఫుల్ బొమ్మ పలు వెబ్సైట్‌లో దర్శనం ఇవ్వడంతో.. నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అంత భారీ బడ్జెట్‌తో తరికెక్కించిన సినిమా లీక్ అవ్వడం మేకర్స్ కు నిజంగానే పెద్ద దెబ్బ అవుతుంది. ఇలాంటి క్రమంలో మేకర్స్ ఏం నిర్ణయం తీసుకునున్నారో.. పైరసీని అరికట్టేందుకు ఎలా ప్రొసీడ్ అవుతారో చూడాలి.