టాలీవుడ్ ఐకాన్ సార్ అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన పుష్ప 2 ఎట్టకేలకు పాజిటివ్ రివ్యూస్‌తో దూసుకుపోతుంది. ఈ సినిమాల్లో రష్మిక మందన హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే పుష్ప పార్ట్ 1లో శ్రీవల్లి క్యారెక్టర్ కి పార్ట్ 2లో శ్రీవల్లి క్యారెక్టర్ కి చాలా వేరియేషన్ చూపించాడు సుక్కు. పార్ట్ 1లో రూ. 1000 ఇస్తే ఎగబడి చూడడం, రూ.5000 ఇస్తే ముద్దుకు కూడా రెడీ అనే అంతలా ఆమె క్యారెక్టర్ దిగజార్చేసి చూపించాడు సుక్కు. అంతే కాదు.. పుష్ప ఎక్కడ పెడితే అక్కడ చెయ్యి వేసిన ఏం మాట్లాడకుండా ఆమె బిహేవ్ చేసిన తీరు.. మరీ ఇంత చీప్‌గా క్యారెక్టర్ డిజైన్ చేశాడు ఏంటి అనిపించింది.
ఈ క్రమంలోని పుష్ప 1లో శ్రీవల్లి పాత్రకు పెద్దగా హైప్ రాలేదు. కానీ.. పుష్ప 2లో మాత్రం శ్రీవల్లి క్యారెక్టర్ ను మరింత పిక్స్ కు తీసుకువెళ్లారు. ఈ సినిమాలో అమ్మడి నటన, రొమాన్స్ అన్ని ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. రోమాన్స్ విషయంలో కాస్త ఓవర్గా అనిపించిందంటూ కామెంట్లు వినిపించాయి. పుష్పరాజ్ అంటే పెద్ద స్మగ్లర్. అలాంటి రేంజ్ ఉన్న భర్తని.. వద్దు అన్నా పదేపదే మెడ పైకి లాక్కెళ్ళిపోయి ఫీలింగ్స్ వస్తున్నాయంటూ వంట గదిలోనే మోటు సరసం చేసే సీన్స్ ప్రేక్షకులకు కాస్త వైల్డ్ గా అనిపించాయి. వామ్మో ఈ శ్రీవల్లి క్యారెక్టర్ ఏంటి మరి ఇంతలా ఉంది.. పుష్ప గాడి పెళ్ళాం కీ ఫీలింగ్స్ అన్ లిమిటెడ్ అనేంతల ఆ క్యారెక్టర్ ను డిజైన్ చేశాడు సుకుమార్.
అయితే.. భర్త గొప్పలు చెప్పడంలో, భర్తను ఎలివేట్ చేయడంలో అమ్మడి మాస్ డైలాగ్స్ కూడా అదే రేంజ్ లో డిజైన్ చేశారు. జాతర సన్నివేశం జరిగే టైంలో.. సవతి అన్నలు పుష్పరాజును కులం లేదు, గోత్రం లేదు.. అంటూ అవమానిస్తుంటే.. అత్తమో నీ కొడుకును అంటే నువ్వు ఊరుకుంటావేమో.. ఆడు నా మొగుడు.. అంటే నేను ఊరుకోను అని చెప్పే ఊర మా డైలాగ్ కు థియేటర్స్ లో భారీగా విజిల్స్ పడ్డాయి. అంతేకాదు.. పుష్పరాజు అంటే పేరు అనుకుంటివా బ్రాండ్ అనే డైలాగ్ ఇప్పటికే విపరీతమైన పాపులారిటీ దక్కించుకుంది. కేవలం డైలాగ్స్ తో మాత్రమే కాదు శ్రీవల్లికి.. పుష్పరాజు ఇచ్చే ఇంపార్టెన్స్ కూడా సినిమాలో మరింత హైప్ తెచ్చింది.
పెళ్ళాం ముచ్చటగా ఇప్పుడు వెళ్తున్న పార్టీకి సీఎం వస్తాడు కదా.. ఆయనతో ఓ ఫోటో తీసుకొని రావయ్యా.. చుట్టుపక్కల వాళ్ళకి చూపించి నా మొగుడు సీఎంతో ఫోటో దిగాడని గొప్పగా చెప్తా అంటూ చెబుతుంది. దీంతో పుష్పరాజు వెళ్లిన పార్టీలో సీఎంతో ఫోటో దిగాలని అడుగుతాడు. సీఎం మాత్రం స్మగ్లర్ తో ఫోటో ఏంటి.. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతా.. అంటూ డైలాగ్ చెప్తాడు. దీంతో పుష్ప ఈగో హర్ట్ అవుతుంది. సీఎం ఫోటో ఇవ్వనందుకు కాదు.. పెళ్ళాం కోరిక కూడా తీర్చలేక పోతున్నానని కోపంతో.. తన డబ్బు పరపతినంత ఉపయోగించి ఏకంగా సీఎంనే మార్చేస్తాడు పుష్పరాజ్. ఆ సీఎంను ఇంటికి తీసుకువెళ్లి శ్రీవల్లితోనే.. వాళ్ళిద్దరి ఫోటో తీపిస్తాడు. ఆ సీన్స్ అయితే ఆడియన్స్ కి గూస్‌బంప్స్ తెప్పించాయి. కేవలం శ్రీవల్లి కోరికకు పుష్పరాజ్ ఈ రేంజ్‌లో ఇంపార్టెన్స్ ఇస్తాడా అనేంతలా శ్రీవల్లి క్యారెక్టర్ డిజైన్ చేశారు.