స్టోరీని కాదు.. పుష్పరాజ్ క్యారెక్టర్ నమ్ముకున్న సుక్కు.. మ్యాజిక్ వర్కౌట్ అయిందా..?

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్ పాన్ ఇండియా లెవెల్లో ఎలాంటి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడో తెలిసిందే. పుష్ప పార్ట్ 1తో ఎన్నో సంచలనాలు సృష్టించిన ఆయన.. పుష్ప 2తో మరోసారి తన సత్తా చాట్టేందుకు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సినిమా కొద్దిసేపటి క్రితం రిలీజై ప్రేక్షకుల నుంచి, విమర్శకులు నుంచి కూడా మంచి ప్రశంసలు దక్కించుకుంటుంది. ఇక పుష్ప పార్ట్ 1లో తన న‌ట‌న‌కు నేషనల్ అవార్డు దక్కించుకున్న బన్నీ.. పుష్ప 2కు అంతకుమించిన‌ రేంజ్‌లో తన నటనతో ఆకట్టుకున్నాడు. తన డైలాగ్ డెలివరీ, రోల్ కు తగ్గట్లుగా తనను తాను మార్చుకున్న విధానం, యాక్షన్, ఎమోషన్స్, రొమాన్స్‌ పండించిన తీరు.. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

ఇక ఈ సినిమా నేడు గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ప్రీమియర్స్ నిన్న రాత్రి అంటే డిసెంబర్ 4న 9:30 కే ప్రదర్శించేశారు. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన రివ్యూ కూడా వైరల్ గా మారుతుంది. సినిమా చూసిన ఆడియన్స్ టాక్ ప్రకారం సుకుమార్ కథ పై కంటే ఎక్కువగా అల్లు అర్జున్ పుష్పరాజ్ క్యారెక్టర్ మీదనే ఫోకస్ పెట్టాడని.. సినిమాల్లో బన్నీ నటన అద్భుతంగా ఉందంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే సినిమా ఫస్ట్ హాఫ్ తో పుష్ప రాజ్‌ను ఎలివేట్ చేస్తూ సినిమాను పీక్ లెవెల్ కు తీసుకువెళ్లారని.. కథ గురించి పెద్దగా చెప్పుకునేందుకు ఏమీ లేకపోయినా.. కేవలం బన్నీ నటనతోనే సినిమాకు బ్లాక్ బస్టర్ తెచ్చుకోవడంలో సుకుమార్ మ్యాజిక్ వర్కౌట్ అయిందంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Pushpa 2 First Review | Pushpa 2 The Rule First Review Rating | Pushpa 2  Telugu Movie First Review | Allu Arjun, Rashmika Mandanna, Fahadh Faasil  Pushpa 2 The Rule Movie First Review - Filmibeat

ప్రతి 10 నిమిషాలకు ఏదో ఒక ట్విస్ట్ ఉండనే ఉందట‌. ఎలివేషన్ , యాక్ష‌న్‌ ఇలా ఏదో ఒకటి కచ్చితంగా చూపించారని.. ఇక ఫస్ట్ ఆఫ్ లో వచ్చిన రెండు సాంగ్స్ పిక్స్ లెవెల్లో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ప్రీ ధియేటర్లు బిజినెస్ రూ.600 కోట్లకు పైగా జరిగింది. ఈ క్రమంలోనే రూ.1000 కోట్ల కలెక్షన్లు పుష్పరాజ్ సులభంగా కొల్లగొడతాడంటూ.. అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ముందు ముందు ఈ సినిమా ఎలాంటి రిజ‌ల్ట్ అందుకుంటుందో.. ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.