టాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీగా పుష్ప 2 ఎట్టకేలకు ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. కొద్ది గంటల క్రితమే పుష్ప 2 ప్రీమియర్ షోస్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇక రిలీజ్‌కు ముందు సినిమాపై నెలకొన్న అంచనాలకు తగ్గట్టుగానే.. రిలీజ్ అయిన తర్వాత జనాల ఎక్స్పెక్టేషన్స్ రిచ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. సుకుమార్ డైరెక్షన్లో అల్లు అర్జున్ హీరోగా రూపొందిన ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్గా కనిపించిన సంగతి తెలిసింది. అయితే ఈ సినిమాల్లో పహద్ పజిల్, అనసూయ, సునీల్, రావు రమేష్, జగపతిబాబు కూడా ప్రధాన పాత్రలో నటించారు. ఇక స్పెషల్ సాంగ్ లో శ్రీల ఐటమ్ క్వీన్ గా మెరిసింది. ఈ సాంగ్ సినిమాకే హైలైట్ అయిందట. అంతేకాదు సినిమాల్లో బనికి సంబంధించిన ప్రతి ఎలివేషన్, డైలాగ్స్, సెంటిమెంట్, రొమాన్స్ ఇలా ప్రతి ఒక్కటి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
సినిమా రిలీజ్ తర్వాత బన్నీ, రష్మిక పేర్లు ఓ రేంజ్‌లో వైరల్‌గా మారుతున్నాయి. అయితే కథలో చెప్పుకోదగ్గట్టు ఏమీ లేకున్నా.. పుష్ప క్యారెక్టర్ తో, స్క్రీన్ ప్లే తో.. ప్రేక్షకులను మెస్వరైజ్ చేశాడు సుక్కు. ఈ సినిమాతో మరోసారి తన మ్యాజిక్ ను రిపీట్ చేసిన లెక్కల మాస్టార్.. దాదాపు అన్ని వర్గాల ప్రేక్షకుల అంచనాలను రీచ్ అయ్యాడంటూ టాక్ నడుస్తుంది. ఇక సుకుమార్.. తను వర్క్ చేసే ఏ సినిమాకైనా.. కథలో ప్రతి ఒక్కరు క్యారెక్టర్ కు సరైన కథ రాసుకుంటాడని.. కథకు తగ్గ న్యాయం చేసేలా వారితో సినిమాను రూపొందిస్తాడని టాక్ ఉండేది. కానీ.. పుష్ప విషయంలో మాత్రం సుకుమార్ కు పలు విమర్శలు ఎదురవుతున్నాయి. పుష్ప సినిమాల్లో సునీల్, అనసూయ క్యారెక్టర్ లను పెద్దగా హైలెట్ చేయలేకపోయాడు అన్న టాక్ అప్పట్లో నడిచిన సంగతి తెలిసిందే.
కనీసం పుష్ప 2 లో అయినా ఈ క్యారెక్టర్స్ హైలైట్ చేస్తారని అంతా భావించారు. కానీ.. ఈ సిరీస్ లో కూడా మళ్లీ అదే రిపీట్ అయింది. అనసూయ క్యారెక్టర్ కు కాస్త హైప్ ఇచ్చినా.. మంగళం శీను క్యారెక్టర్ లో సునీల్‌ను డమ్మీగా చూపించాడు. సుకుమార్ కథ చేసుకునే సమయంలోనే సునీల్ క్యారెక్టర్ పై కూడా కాస్త హైలైట్ అయ్యేలా శ్రద్ధ చూపి ఉంటే బాగుండేదని.. సునీల్ క్యారెక్టర్ అసలు వర్కౌట్ కాలేదంటూ.. నిజానికి అనసూయ కంటే సునీల్ కె మంచి నేమ్ ఉంది. కానీ.. సినిమాలో అనసూయను హైప్ చేసి.. సునీల్‌ను డమ్మీగా చూపించారంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అసలు అనసూయ పాత్ర ఉండాల్సిన అవసరం కూడా లేదని.. కేవలం సునీల్ మంగళం శీనుగా పవర్ ఫుల్ పాత్రలో చూపించిన జనాలను ఆకట్టుకునే వాడంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక ఈ సునీల్ క్యారెక్టర్, ద్రాక్షయణిగా అనసూయ క్యారెక్టర్ల లోటులో తప్ప పెద్దగా చెప్పుకో తగ్గ మైనస్ పాయింట్ లేవీ లేవని.. ఈ ఒక్క తప్పు చేసి ఉండకపోతే పుష్పా సినిమాకు అసలు రిమార్క్ అనేది ఉండేది కాదంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక సినిమాలో బన్నీ తన నట విశ్వరూపాన్ని చూపించాడు. ఏ స్టార్ హీరోలు టచ్ చేయని రేంజ్ కు బన్నీ పుష్ప 2తో వెళ్లడం ఖాయం అంటూ సినిమా చూసిన ఆడియన్స్ నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.