అల్లు అర్జున్, సుక్కుమార్ కాంబోలో రష్మికమందన హీరోయిన్‌గా రరూపొందిన పుష్ప 2 ఎట్టకేలకు థియేటర్స్‌లోకి వచ్చేసింది. ఈ క్రమంలోనే నిన్న రాత్రి 9:30 నుంచి పుష్ప 2 ప్రీమియర్స్ గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేశారు. ఈ సినిమా కోసం అల్లు అభిమానులతో పాటు.. చాలామంది సినీప్రియలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఈ క్రమంలోనే పుష్ప 2.. తెలుగు రాష్ట్రాల్లో మంచి హవాతో దూసుకుపోతుంది. బన్నీ అభిమానులతో థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొంది. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత బన్నీ నుంచి వచ్చిన కావడంతో సినిమా థియేటర్ల వద్ద ఫ్యాన్స్ బీభత్సం సృష్టించారు.
ఇక సినిమా చూసిన ఆడియన్స్ నుంచి ప్రీమియర్ టాక్ రివ్యూ కూడా బయటకు వచ్చేసింది. ఇప్పటికే సినిమాపై పాజిటివ్ టాక్ రావడంతో ఆడియన్స్ లో సినిమా పై మరింత ఆసక్తి నెలకున్నాయి ఇలాంటి క్రమంలో పుష్ప 2 ఓటీటీ ప్లాట్‌ఫామ్ కూడా ఫిక్స్ అయింది. బడా ఓటీటీ ప్లాట్ ఫామ్‌లో ఒకటైన నెట్ ఫ్లిక్స్.. పుష్ప 2 డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ సినిమాను భారీ ధరకే నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్టు సమాచారం.
12 వారాల తర్వాత స్ట్రీమింగ్ చేసుకునేలా మేకర్స్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారట. ఇక పుష్ప 1 ఓటీటీ రైట్స్‌ను గతంలో అమెజాన్‌ప్రైమ్ కేవలం రూ.30 కోట్లకు దక్కించుకుంది. ఇక ప్రస్తుతం పుష్ప 2 ఓటీటీ రైట్ ను నెట్‌ఫ్లిక్స్ ఏకంగా రూ.275 కోట్ల బడ్జెట్‌తో సొంతం చేసుకుంది. కాగా ఇప్పటివరకు ఆర్ఆర్‌ఆర్ రూ.176కోట్లకు ఓటీటీ హక్కులు అమ్మగా.. పుష్ప 2 ఓటీటీ రికార్డ్స్ ఇప్పటివరకు ఉన్న రికార్డులు అన్నిటిని బ్రేక్ చేసి.. అన్నిటికంటే ఎక్కువ ధరకు అమ్ముడుపోయిన సినిమాగా రికార్డును సొంతం చేసుకుంది.