అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కిన పుష్ప 2 థియేటర్స్ లో రిలీజ్ అయింది. రష్మిక మందన హీరోయిన్గా, ఫాహద్ పాజిల్ జగపతి బాబు, ధనుంజయ్, రావు రమేష్, సునీల్, అనసూయ కీలకపాత్రలో నటించిన ఈ సినిమా పై ఇప్పటికీ ప్రేక్షకుల్లో పీక్స్ లెవెల్‌లో అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకు పాటలు చంద్రబోస్, యాక్షన్.. పీటర్ ప్రకాష్, కిచెన్ నవకాంత్ అందించారు. సినిమాటోగ్రఫర్‌గా కూబా, ఎడిటర్ గా నవీన్ నూలి వ్యవహరించారు. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్‌గా.. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యార్నెని, రవిశంకర్ ఎలమంచిలి ప్రొడ్యూస్ చేశారు. 200 నిమిషాలు నడివి.. యూ/ఏ సర్టిఫికెట్‌తో ఈ మూవీ నేడు గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే నిన్న రాత్రి 9 గంటల నుంచి ప్రీమియర్ షోస్ పడిపోయాయి. ఇక సినిమా ఎలా ఉందో.. పుష్ప గాడు అంచనాలను అందుకున్నాడో.. లేదో రివ్యూ లో చూద్దాం.
స్టోరీ:
కథ పరంగా చూస్తే పుష్ప వన్‌కు కొనసాగింపగానే ప్రారంభమైంది. కథలో పెద్దగా మలుపులు ఉండవు. పుష్ప.. తన భార్య శ్రీవల్లి.. కాపురం. ఈ క్రమంలోనే శ్రీవల్లి కోరిక కోసం సీఎంని ఫోటో అడిగితే అతను నో చెప్పడం. సీఎంను మార్చేసి రూ.5వేల కోట్ల డీల్ కుదుర్చుకుని.. ఎంపీగా ఉన్న రావు రమేష్ ని సీఎం చేసేస్తాడు. ఈ క్రమంలో భన్వర్ సింగ్ తో ఫస్ట్ పార్ట్ లోని వైరం మరింతగా ఎలా పెరిగింది..? ప్రతాపరెడ్డి తో పుష్పాకు అసలు వివాదం ఎక్కడ మొదలైంది..? లోకల్ స్మగ్లర్ గా ఉన్న పుష్ప ఇంటర్నేషనల్ డ్రాగన్ రేంజ్ కు ఎలా ఎదిగాడు..? ఇక ఫస్ట్ పార్ట్ లో చూపించిన తండ్రి ఫ్యామిలీకి, అన్నదమ్ములకు దూరంగా ఉన్న పుష్ప.. తర్వాత ఎలా దగ్గరయ్యాడు..? ఈ సందేహాలు అన్నిటికీ పుష్ప 2లో సమాధానం దొరికింది.
మూవీ రివ్యూ:
పుష్ప 1లో చూపించిన విధంగా పగతో రగిలిపోతున్న పుష్ప.. భన్వర్ సింగ్‌తో సవాల్ చేసి మరి సరుకు బోర్డర్ దాటించే సీన్ అదరగొట్టేసాడు. సండ్ర దొంగలను లారీ ఎక్కించి.. డైవర్ట్ చేశి.. ఎర్రచందనం దుంగలను ఎడ్లబండిగా మార్చి.. అందరిని బకరాలు చేయడం సినిమాలో ఓ హైలెట్. ఇక సరుకు తమిళనాడు.. రామేశ్వరం నుంచి శ్రీలంక సముద్ర మార్గంలో బోర్డర్ దాటించేసారు. అసలు ప్రతి పది నిమిషాలకు ఒకసారి సినిమాలో సరికొత్త ట్విస్టులు వస్తూనే ఉన్నాయి. అది ఎలివేషన్ అయినా, ఎమోషన్ అయినా, రొమాన్స్ అయినా, యాక్షన్ అయినా ఏదో ఒక విధంగా థియేటర్లలో విజిల్స్ మోతమోగిపోయింది. ఎక్కడైనా గ్రాఫ్ తగ్గుతుందనిపించే లోపే మరో అదిరిపోయే ఎలివేషన్. లెక్కల మాస్టర్ సరైన లెక్కలు కట్టి ఆడియన్స్ను మెస్మరైజ్ చేశాడు. ఈ క్రమంలోనే మూడు గంటలను నడిపి ఉన్న సినిమా అయినా అసలు బోర్ ఫీలింగే రాలేదు. సీఎం.. పుష్ప తో ఫోటో ఇవ్వలేదని సవాల్ చేసి మరీ చెప్పిన టైం కు సీఎం ను మార్చేయడం.. బన్నీ ఫ్యాన్స్ కే కాదు, సాధారణ ప్రేక్షకులకు కూడా కన్విన్సింగ్ గా అనిపించింది.
జపాన్ ఫైటర్లతో సినిమా స్టార్టింగ్ లోనే పుష్ప రాజ్ ఎలివేషన్ ఫైట్ గూస్ బంప్స్ తెప్పించింది. సీఎంను కలిసేందుకు వెళ్లిన టైం లో భార్య శ్రీవల్లి కోరిక మేరకు సీఎంతో ఫోటో అడిగితే స్మగ్లర్ తో ఫోటో ఏంటి అని సీఎం ఇవ్వకపోవడం.. వెంటనే ఎంపీగా ఉన్న రావు రమేష్ ను సీఎం అయిపోతున్నావు అని అతనితో ఫోటో తీసుకునే సీన్ అయితే పీక్స్ లెవెల్ లో ఉంది. సీఎం సీటు కోసం రావు రమేష్‌ను న్యూఢిల్లీ పంపి.. జగపతిబాబుతో ఫోన్లో మాట్లాడిన సీన్ అదిరిపోయింది. జస్ట్ ఫోన్ కలిపినందుకు రూ.5 కోట్లు, మాట్లాడినందుకు రూ.25 కోట్లు ఇచ్చి పుష్ప గాడి రేంజ్ ఏంటో ఆడియన్స్ కు చూపించారు. ఇక స్మగ్లర్తో డీల్ మాట్లాడుతున్న టైంలో శ్రీవల్లి వండిన కూరల పుష్ప.. ఉప్పు తగ్గిందన్నడం.. రష్మిక అలగడం.. వెంటనే బన్నీ ఉప్పు పంచాయతీ ఏందిరా అంటూ లోపలికి వెళ్లి.. రష్మిక ఫీలింగ్స్ వస్తున్నాయంటే రష్మిక కాలి మీద పుష్ప మార్క్ తగ్గేదేలే స్వాగ్ ఇస్తూ మేనరీజం సరికొత్తగా చూపించడం అందరిని ఆకట్టుకుంటుంది. ఫీలింగ్ సాంగ్ లో రష్మిక అందాలు.. బన్నీ ఎనర్జిటిక్ డ్యాన్స్ స్టెప్స్, ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. అలా పుష్ప 2 మొదట జపాన్ ఫైటర్లతో ఎలివేషన్ దగ్గర నుంచి ప్రతి సీను ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఫస్ట్ ఆఫ్ లో పుష్ప ఎంట్రీ సాంగ్, రష్మిక తో ఫీలింగ్ సాంగ్ ప్రేక్షకులకు బిగ్ రిలీఫ్. క్రేజీ ఫీలింగ్ సాంగ్ లో బన్నీ, రష్మిక ఇద్దరూ ఎనర్జీటిక్ స్టెప్‌లతో కేక పుట్టించారు.
ఫస్ట్ అఫ్ తో దుమ్ము దులిపిన పుష్పరాజ్.. సెకండ్ హాఫ్ లో కాస్త సెంటిమెంట్ ఎక్కువ చూపించాడు. సినిమా స్టార్టింగ్ నుంచి కాస్త స్లోగా మూవ్ అవుతున్న కంప్లైంట్ ఉన్నా.. బోర్ కొట్టకుండా నడిచింది. సుకుమార్ స్క్రీన్ ప్లే ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక జాతర ఫైట్ తో పాటు ప్రతాప్ రెడ్డి కొడుకు.. పుష్ప సవితి అన్న కూతురిని కిడ్నాప్ చేస్తే విడిపించుకునే టైంలో వచ్చిన ఫైట్ సినిమాను పీక్స్ లెవెల్ కు తీసుకెళింది. ఇక శ్రీలీల, బన్నీ కిసికి సాంగ్ అదరగొట్టేసారు. సినిమా కథ విషయంలో సుకుమార్ పెద్దగా కష్టపడకపోయినా.. కంటెంట్ తో పాటు స్క్రీన్ ప్లే విషయంలో చాలా శ్రద్ధ తీసకునట్లు అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ అంత పుష్ప మీద విపరీతమైన ఎలివేషన్లు ఇస్తూ రేంజ్ పెంచేసిన సుక్కు.. సెకండ్ హాఫ్ లో ఫ్యామిలీ సెంటిమెంట్, డ్రామాకు ప్రయారిటీ ఇస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. సెకండ్ హాఫ్ ఫ్యామిలీ సెంటిమెంట్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఇక తన అన్న కుమార్తెను కాపాడుకోవడం కోసమే పుష్పరాజ్ కేంద్రమంత్రి ప్రతాపరెడ్డి అన్నకుమారెడ్డి వదిలినట్టు వదిలి.. త్రిశూలంతో చంపి పైకి లేపే సీన్.. ఆడియన్స్ కు గూస్‌బంప్స్ అంతే. అరాచకం సృష్టించాడు. ఇక డైలాగ్ల విషయానికి వస్తే పుష్పని సవతి అన్న అవమానించే టైంలో రష్మిక ఎమోషనల్ గా చెప్పే డైలాగ్స్, యాక్టింగ్ హార్ట్ టచ్చిగా ఉంటుంది. అత్త.. నువ్వు నీ కొడుకు అంటే ఊరుకుంటావేమో.. కానీ నా మొగుణ్ణి అంటే నేను అసలు ఊరుకోను.. అంటూ శ్రీవల్లి పుష్పను ఎలివేట్ చేస్తూ.. పుష్ప అంటే బ్రాండ్ అనే డైలాగ్ అదుర్స్. ఇక బన్నీ చెప్పిన మాస్ డైలాగ్స్ లో.. పెళ్ళాం అడిగేది నూటికో.. కొట్టుకో.. ఓ కోరిక. అది కూడా తీర్చనివాడు మొగుడు ఎట్టాఅవుతాడు.. అని బన్నీ చెప్పే డైలాగ్ మాస్ ను ఆకట్టుకుంటుంది.
నటీనటుల పర్ఫామెన్స్
బన్నీ నటవిస్వరూపం చూపించేసాడు. పుష్ప 1ను మించేలా తన నటనతో అదరగొట్టాడు. రోల్ కోసం తనను మలుచుకున్న తీరు, సీన్ సీనుకు వేరియేషన్స్ లో వైవిద్యత, డైలాగ్ మాడ్యుషన్, శ్రీవల్లితో రొమాన్స్, యాక్షన్ డైలాగ్స్, ఎక్స్ప్రెషన్స్, ఎనర్జిటిక్ స్టెప్స్, ఇలా చెప్పుకుంటూ పోతే.. ప్రతి సింగిల్ విషయంలోనూ బన్నీ తన సత్తా చాటుకున్నాడు. రగడ్ అండ్ రఫ్ యాక్టింగ్ తో దుమ్ము దులిపేశాడు. ఇక రష్మిక రొమాన్స్ సీన్స్ లో అదరగొట్టేసింది. రెండు మూడుసార్లు ఫీలింగ్స్ వస్తున్నాయంటూ బన్నీ చొక్కా విపేయడం ఊర మాస్ ఫ్యాన్స్ తోనే కాదు.. సోఫాలో ఉన్న క్లాస్ ఫ్యాన్స్ తోను విజిల్స్ వేయించింది. పుష్ప భార్యా పాత్రలో ఫస్ట్ పార్ట్ కంటే కూడా రష్మిక టైం స్పేస్ ఎక్కువగా ఉంది. ఇక పుష్ప ఫాహద్‌కు సారీ చెప్పి.. ఆవేదనతో రగిలిపోయి.. తిరిగి వెనక్కి వచ్చి అదే పాత స్విమ్మింగ్ పూల్‌లో తోసి మరి.. ఆ నీటిలో యూరిన్ పోసే సీన్ పీక్స్ అంతే.
సుకుమార్ ఈ సీన్ తో పుష్ప రేంజ్ ఏంటో.. పుష్ప సారీ చెబితే వీరంగం ఎలా ఉంటుందో.. క్రియేటివ్ గా ఆలోచించి చూపించాడు. ఫాహద్‌కు కౌంటర్గా దమ్ముంటే పట్టుకోరా అంటూ.. తొడ కొట్టి సవాల్ చేయడం ఆడియన్స్‌ను ఫుల్ గా ఎంటర్టైన్ చేసింది. స్క్రీన్ ప్లే లో ప్రతి పది నిమిషాలకు హై ఎలిమెంట్ ఉండటంతో పుష్ప 2కు మ్యాజిక్ బాగా వర్కౌట్ అయింది. పుష్ప మీద పగతో రగిలిపోయే పాత్రలో ఫాహద్ అదరగొట్టాడు. యూరిన్ పోసిన నీటిలో నానిన పుష్ప బట్టలు.. విప్పేస్తే అవమానంతో రగిలిపోయి ఇచ్చే ఎక్స్ప్రెషన్స్.. ఫాహద్‌లో ఉన్న యాక్టింగ్ టాలెంట్ ని సరికొత్తగా చూపించాయి. జగపతిబాబు, రావు రమేష్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. అయితే జగపతిబాబు కంటే ఎంపీగా నటించిన రావు రమేష్ పాత్రకు బాగా స్కోప్ ఉందనిపించింది. మంగళ శీను భార్యగా దాక్షాయిని పాత్రలో అనసూయ పుష్పపై పగ తీర్చుకునే సీన్ ఆడియన్స్‌కు బాగా నచ్చేసింది. అనసూయకు నెగటివ్ రోల్ బాగా క్లిక్ అవుతుంది. భవిష్యత్తులో ఈ తరహా నెగటివ్ రోల్స్ ఎక్కువగా వస్తాయి అనడంలో అతిశయోక్తి లేదు. సునీల్ ఫస్ట్ షాప్ లో తన పాత్రను కొనసాగించిన.. అనసూయ పాత్రతో పోలిస్తే కాస్త డల్ గా అనిపించింది. ఇక ఓ సీన్‌లో అయితే అనసూయ.. నా మొగుడు చేతగానివాడు అనే డైలాగ్ సునీల్ ఉద్దేశించి చెప్పింది. నిజానికి అనసూయ పాత్రతో పోలిస్తే.. సునీల్ అసలు డమ్మీ కాదు. కానీ.. సినిమాలో డమ్మీ అయిపోయాడు.
టెక్నికల్ గా
డిఎస్పి మరోసారి తన మార్క్ మ్యూజిక్ తో అదరగొట్టాడు, థియేటర్లో స్క్రీన్ పై వచ్చిన ప్రతి సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. జాతర సాంగ్ చూస్తే పూనకాలు వచ్చేసేలా అనిపించింది. ఇక ఆ డ్యాన్స్ స్టెప్స్.. మూమెంట్స్ అయితే వేరే లెవెల్. మ్యూజిక్ డైరెక్టర్గా దేవిశ్రీ తో పాటు కొన్ని సీన్లలో సి. ఎస్. శ్యామ్ కూడా వ్యవహరించారు. పాటలతో పోలిస్తే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అంత రేంజ్ లో లేదనిపించింది. డిఎస్పి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో పెద్దగా ఎఫర్ట్ పెట్టలేదని.. ఉన్న కంప్లైంట్ తోనే మైత్రి వాళ్ళు ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లను తీసుకున్నారన్నది వాస్తవమే అని సినిమా చూస్తే అర్థమవుతుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అనుకున్న రేంజ్ లో లేదు. ఇక ఎడిటింగ్ నవీన్ నులి కొన్ని సీన్స్ ట్రిమ్ చేయాల్సిందేమో అనిపించింది.
సుకుమార్ స్క్రీన్ ప్లే ప్రకారం చూపించారు. ఫస్ట్ హాప్ అంతా బాగున్నా.. సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్లు ట్రిమ్ చేసి ఉంటే బాగుండేదని.. అంత ఇంపార్టెన్స్ లేని సీన్లు కూడా ఉన్నాయ్ అనిపించింది. ఇక ఫైట్ సీన్స్ విషయానికి వస్తే జపాన్ ఫైట్, జాతర ఫైట్ కంపోసింగ్ అదరగొట్టారు. సినిమాటోగ్రఫ్ కి రిచ్ గా.. కలర్ ఫుల్ గా కనిపించింది. ఎర్రచదనం దొంగలు చేంజింగ్ సీన్లు వైట్ మోడ్లో తీయడం ఆకట్టుకుంటుంది. పాటలోను విజువల్స్ హైలెట్. మైత్రి ప్రొడక్షన్ వాల్యూస్ కు ఎక్కడ పేరు పెట్టలేనట్లు సినిమాను తెరకెక్కించారు. రాజీ పడకుండా ఆల్ ఇండియా స్థాయికి తగ్గట్లుగా సినిమాను నిర్మించారు. ఈ సినిమా తర్వాత మైత్రి బ్యానర్స్ వాల్యూ మరింతగా పెరుగుతుంది పాన్ ఇండియా లెవెల్ లో మారుమోగిపోతుంది.
ప్లస్ లు
అల్లు అర్జున్ క్యారెక్టర్ ,రష్మిక రొమాన్స్, జపాన్ ఫైట్ సీన్, సీఎంతో ఫోటో ఎపిసోడ్, ఇంటర్వెల్ బ్యాక్, ఫీలింగ్ సాంగ్
మైనస్ లు
కామన్.. స్టోరీ, నెరేషన్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అంచనాలను అందుకోలేదు, రన్ టైం, సెకండ్ హాఫ్ కాస్త డల్ అయింది.
చివరిగా
పుష్ప రాజ్ నట విశ్వరూపం చూస్తారు. మలుపులు లేకున్నా కథకు సుకుమార్ కళ్ళు చెదిరే ఎలివేషన్స్.. మైండ్ బ్లోయింగ్ యాక్షన్ సీన్లతో మెస్మరైజ్ చేశాడు. పుష్ప 2 మాస్ ఆడియోస్ తో పాటు.. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అనడంలో అతిశయోక్తి లేదు.
రేటింగ్: 3.50/5