టాలీవుడ్ స్టార్ అర్జున్ హీరోగా, సుకుమార్ డైరెక్షన్లో రూపొందిన మోస్ట్ ఎవైతెడ్ మూవీ నేడు గ్రాండ్ లెవెల్లో ప్రేక్షకులు ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నిన్ను రాత్రి 9:00 నుంచి ప్రీమియర్ షో ప్రారంభమైపోయాయి. అల్లు అర్జున్ అభిమానులతో పాటు సినీప్రియులు చాలామందే పుష్ప 2ని చూసేశారు. ఇక రిలీజ్‌కు ముందు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన పుష్ప 2 ట్విట్టర్‌లో ఇప్పుడు తెగ ట్రెండింగ్‌గా మారింది. నేషనల్ వైడ్‌గా పుష్ప 2 ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. బన్నీ ఎంట్రీ సీన్స్, ఫైటింగ్, యాక్షన్ సీన్స్ గూడ్స్ బంప్స్ తెప్పిస్తున్నాయని.. ముఖ్యంగా సీఎంతో పుష్పసీన్ అదిరిపోయింది అంటూ ప్రిమియర్ షో చూసిన నెటిసన్స్ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ట్రైలర్లో చూపించిన జపాన్ ఫైట్ తోనే బన్నీ ఎంట్రీ సీన్ పెట్టారని.. అక్కడ బన్నీ ఊచకోత ప్రారంభమైందని.. బన్నీ దెబ్బకు స్క్రీన్లు తగలబడి పోతున్నాయి అంటూ చెప్తున్నారు. పుష్ప యాక్షన్ సీక్వెన్స్, డైలాగ్స్ థియేటర్లో మూత మోగిపోతున్నాయని వెల్లడించారు. ఇప్పటికే ఎంట్రీ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Entry 🔥🔥 #Pushpa2 #Pushpa2TheRule #AlluArjun #Pushpa2Celebrations pic.twitter.com/YlrZ7FZojX
— 𝐌𝐚𝐡𝐢 𝐆𝐨𝐮𝐝!𝐃𝐡𝐟𝐦🦅 (@MaheshNars32966) December 4, 2024
ప్రతి సీన్ లెక్కల మాస్టర్ కరెక్ట్ గా లెక్కేసి మరి డిజైన్ చేశాడని.. సుక్కు పై ప్రశంసాలో వర్షం కురిపిస్తున్నారు. ఓ యాక్షన్ సీన్, ఓ ఎలివేషన్ స్వీన్, ఓ ఎమోషనల్ సీన్, ఓ రొమాంటిక్ సీన్.. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ప్రేక్షకులకు ఏదో ఒకటి పది నిమిషాలకు ఒకసారి వస్తూనే ఉందని.. పకడ్బందీగా స్క్రీన్ ప్లే రాసుకున్నాడంటూ తెలియజేశారు. శ్రీవల్లి ఎంట్రీ, షేకావత్ మారువేషం ఎంట్రీ, పుష్ప.. పుష్ప.. సాంగ్ ఇలా అన్ని అదిరిపోయాయంటూ రివ్యూలలో తెలియజేశారు. ఇక సీఎంతో ఫోటో దిగమని శ్రీవల్లి పుష్పాకి చెప్పడం.. పుష్ప పార్టీలో ఫోటో అడిగితే సీఎం ఇవ్వనని చెప్పేయడం.. నేను ఫోటో దిగిన వాడే నెక్స్ట్ సీఎం అవుతాడని పుష్ప చెప్పే డైలాగ్ గూస్ బంప్స్ అంటూ.. పుష్పరాజ్ ర్యాంపేజీ ఆడేసిందంటూ.. ఆ సీన్‌కు మాస్ ఫ్యాన్స్ ఫిదా అవ్వాల్సిందే అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
Pushpa Gadu Sorry Cheppadu 🥵🔥#Pushpa2TheRule #Pushpa2 pic.twitter.com/QpyxeFhBDJ
— ᴹʳ𝐇𝐚𝐫𝐢 kυƚƚყ 🦁 (@HariVjSam) December 4, 2024
అనసూయ ఎంట్రీ, షేకావత్ పుష్ప ఫేస్ ఆఫ్ అదిరిపోయాయట. ఇక ఇగోపై నడిచే ఈ సన్నివేశాలు పిక్స్ లెవెల్ లో ఉన్నాయని చెప్తున్నారు. ఫస్ట్ హాఫ్ లో పుష్ప గాడు సారీ చెప్పే సీన్.. అక్కడ బన్నీ చేసే యాక్షన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఫుల్లుగా తాగేసి ఉండే పుష్ప అసలు సారీ చెప్పాడా.. లేదా.. అసలు ఏం చెప్తాడు.. ఏం జరుగుతుంది.. అన్న ఉత్కంఠ ఆడియన్స్‌లో క్రియేట్ చేశాడు. అసలు జాతర సీను లేకుండా ఫస్ట్ ఆఫ్ లో మాస్ జాతర చూపించాడని కామెంట్స్ చేస్తున్నారు. ఇక జాతర సీన్ గురించి మాట్లాడుతూ.. అందరికీ పూనకాలు తెప్పించావు కదా అయ్యా.. జాతర సింగ్ సూపర్.. గుస్‌బంప్స్ అంతే.. బన్నీ నట విశ్వరూపం చూపించాడు అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఫస్ట్ ఆఫ్ గురించి రివ్యూ ఇస్తూ ఎలాంటి కంప్లైంట్స్ లేవని.. డిఎస్పి కుమ్మేసాడు.
#Pushpa2TheRule – Terrific first half 🔥🪓.#AlluArjun ‘s entry is gonna be remembered for ages. On par with entry’s from #RRR
BGMs top notch from @ThisIsDSP.#Sukumar sir too good asala 🔥🔥🔥🪓.@alluarjun @iamRashmika ❤️🔥#Pushpa2 #Pushpa2TheRuleOnDec5th
— Peter Reviews 🔥🪓 (@urstruelypeter) December 4, 2024
ప్రతి సీన్‌కు ఆర్‌ఆర్ఆర్ అదిరిపోయింది. సుక్కు టేకింగ్, మేకింగ్ స్టైల్ వేరే లెవెల్.. అన్ని సూపర్ అంటూ రివ్యూ ఇచ్చారు. సీలింగ్ పాటలో శ్రీవల్లి అందాలు, బన్నీ స్టెప్పులు ప్రేక్షకులను మరింత ఎనర్జిటిక్ గా చేశాయని ఇంటర్వెల్ సీన్‌కు పుష్ప, షేకవత్ డైలాగ్స్ అదిరిపోతాయి అంటూ రాసుకోచ్చారు. అందులో బన్నీ పూనకాలు వచ్చినట్లు ఊగిపోయే సీన్స్ అమ్మవారుపూనినట్లు నటించిన తీరు ఇండియన్ స్క్రీన్ చరిత్రలోనే ఎప్పటికీ నిలిచిపోతుందని చెప్తున్నారు. సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ సీన్స్ ఏడిపించే సాయాన్ని.. అజయ్, బన్నీ మధ్య వచ్చే ఎమోషనల్ పార్ట్ అయితే ఆడియన్స్ను కదిలిస్తుందని చెప్తున్నారు. ఫస్ట్ ఆఫ్, సెకండ్ ఆఫ్ రిపోర్టులను బట్టి సినిమా అదిరిపోయిందని.. ఎమోషనల్ సీన్స్ చాలా వరకు వర్క్ అవుట్ అయినట్లు తెలుస్తుంది. యాక్షన్ సీక్వెన్స్, ఎలివేషన్స్లకు లెక్కే లేదట. బన్నీ ఫ్యాన్సే కాదు.. సాధారణ ఆడియన్స్‌కు కూడా మాస్ జాతరతో.. బన్నీ ఫుల్ మీల్స్ పెట్టాడని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక పూర్తి రివ్యూ రావాలంటే మరి కొంతసేపు వేచి చూడాల్సిందే.
అయ్యా అయ్యా అందరికి పూనకాలు తెప్పించ్చావ్ కదయ్య #AlluArjun 🙆🏼♂️ జాతర సీన్ 👌🏼 నట విశ్వరూపం 🔥 #Pushpa2 #PushpaTheRule #Pushpa2WildfireJAAthara pic.twitter.com/ZxodfPQZbI
— Nadeem Shhaikh (@its_nadeemshaik) December 4, 2024