విడాకుల రూమర్ల‌కు బాల‌య్య షోలో రాడ్ దింపే ఆన్స‌ర్ ఇచ్చిన సూర్య‌..!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఇటీవల బాలకృష్ణ అన్‌ స్టాపబుల్ 4 షో లో సందడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం వైరల్గా మారుతుంది. ఇక ఈ షోలో సూర్యతో పాటు.. కొంగువ డైరెక్టర్ శివ, నటుడు బాబి డియోల్ కూడా సందడి చేశారు. ఇక కంగువ‌ సినిమా ఈ నెల 14న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో సూర్యుని ఫుల్ గా ఎంటర్టైన్ చేసిన బాలయ్య.. ఆడియన్స్ కు తన క్వశ్చన్స్ తో ఫుల్ కిక్ ఇచ్చాడు. ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను సూర్య నుంచి రాబట్టాడు.

Suriya - Balayya : బాలయ్య కాళ్లకు నమస్కరించిన సూర్య.. ఇద్దరూ కలిసి డ్యాన్స్ వేసి.. | Surya bowed to balakrishna feet in unstoppable show-10TV Telugu

ఈ క్రమంలోనే బాలయ్య ఎవరినైనా ప్రేమించావ అని సూర్యను ప్రశ్నించగా.. వద్దు సార్ ఇప్పుడు పెళ్లయింది. ఇంటికి వెళ్ళాలి నాకు ఇబ్బంది అంటూ ఫన్నీ కామెంట్ చేశాడు. అయితే తమ్ముడు కార్తీ తో ఫోన్ మాట్లాడిన టైంలో.. ఓ హీరోయిన్ పై అన్నయ్యకు క్రష్ ఉందంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఇదే షోలో జ్యోతిక తో సూర్యా విడాకులపై వ‌స్తున్న‌ వార్తలకు రాడ్ దింపే ఆన్స‌ర్‌తో చెక్ పెట్టాడు. బాలయ్యతో జ్యోతిక గురించి సూర్య మాట్లాడుతూ.. జ్యోతిక లేకుండా నా లైఫ్ నే ఊహించుకోలేను.. ఐ లవ్ జ్యోతిక అంటూ ఎమోష‌న‌ల్ కామెంట్స్ చేశాడు.

దీంతో సూర్య జ్యోతిక‌కు మ‌ద్య ఎలాంటి విభేధిలు లేవ‌ని ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు. ప్రస్తుతం సూర్య.. జ్యోతిక గురించి చేసిన కామెంట్స్ నెటింట వైరల్ అవ్వడంతో సూర్య, జ్యోతిక అభిమానులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. మీ ప్రేమ జ్యోతిక‌పై ఎప్పుడు ఇలానే ఉండాలంటూ.. ఈ ఫ్యామిలీ లైఫ్ లాంగ్ ఇలానే హ్యాపీగా ఉండాలంటూ.. కామెంట్లు చేస్తున్నారు. విడాకుల రూమర్లు క్రియేట్ చేసిన వారిపై మండిపడుతున్నారు.