డార్లింగ్ హీరో ప్రభాస్ అభిమానులు మౌన దీక్ష..ఎందుకోసమో తెలుసా..?

కల్కి సినిమా చూడడానికి ఫ్యాన్స్ ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . చాలామంది ఆఫీసులకు లీవ్స్ వేసుకొని కూడా ముందుగానే పక్కా ప్లానింగ్ తో కలిపి సినిమా చూడడానికి సిద్ధమవుతున్నారు . హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమా ఉండబోతుంది అన్న ప్రచారం బాగా ఊపందుకుంది . ఇప్పటివరకు రిలీజ్ అయిన ట్రైలర్ టీజర్ అప్డేట్స్ చూస్తే ఖచ్చితంగా ఈ సినిమా చరిత్ర తిరగరాయబోతుంది అని చెప్పడంలో సందేహం లేదు .

ఇప్పటికే టికెట్స్ బుకింగ్ ఓపెన్ అయిపోయాయి. ప్రతి చోట కూడా దుమ్ము దులిపే రేంజ్ లో కలెక్షన్స్ సాధించే విధంగా రెబెల్ అభిమానులు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. అయితే కొన్నిచోట్ల మాత్రం కొన్ని కారణాల చేత కల్కి టికెట్ బుకింగ్స్ మొదలవ్వలేదు.. తెలుగు రాష్ట్రాలలో కొన్నిచోట్ల టికెట్ బుకింగ్స్ ఇంకా ఓపెన్ చేయకపోవడంతో రెబల్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. హైదరాబాదులోని కల్కి చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి ఫిలిమ్స్ ఆఫీస్ వద్ద వచ్చి ఆందోళన చేశారు . దానికి సంబంధించిన ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

కల్కి సినిమా టికెట్స్ ఇవ్వాలి అని .. కల్కి సినిమా టికెట్స్ బుకింగ్ ఓపెన్ చేయాలి అని వైజయంతి ఫిలిం ఆఫీస్ బయట మౌన దీక్ష చేశారు. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు ప్రభాస్ అభిమానులు అలాగే మౌన దీక్ష చేశారు . దీనిపై పలువురు విమర్శలు చేస్తున్నారు జనాలు. ఎందుకని ఇలా చేస్తున్నారు..? టికెట్స్ ఎందుకు ఓపెన్ చేయలేదు ..? అంటూ మండిపడుతున్నారు . మొత్తానికి కల్కి సినిమా అన్ని రకాలుగా వైరల్ అవుతుంది అన్నది మాత్రం వాస్తవం..!!