ప్రభాస్ ..గురించి ప్రత్యేకంగా చెప్పాలా ..? పాన్ ఇండియా హీరో ..రెబల్ హీరో ..సిగ్గుపడే హీరో ..టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరో ..తన సినిమా ప్రమోషన్స్ లో కూడా సరిగ్గా మాట్లాడకుండా ఉండేటటువంటి హీరో.. ఈ విషయాలు అందరికీ తెలిసిందే.. ఆయన నటించిన కల్కి సినిమా మరికొద్ది గంటల్లోనే థియేటర్స్ లో రిలీజ్ కాబోతోంది . ఈ క్రమంలోనే ప్రభాస్ కి సంబంధించిన ఒకప్పటి వార్తలను కూడా ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు .
కాగా ఇటీవల కన్నప్ప సినిమాలో ప్రభాస్ నటించిన సీన్ కి సంబంధించిన కళ్ళను ఒక్కటే రివీల్ చేస్తే ప్రభాస్ అభిమానులు ఎంత వైరల్ చేశారో మనకు తెలిసిందే . అయితే ప్రభాస్ హిందీలో ఒక గెస్ట్ రోల్ చేశాడు అన్న విషయం ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ హీరోగా కొరియోగ్రాఫర్ ప్రభుదేవా తెరకెక్కించిన యాక్షన్ జాక్సన్ సినిమా 2014లో విడుదలైంది . ఈ మూవీలో సోనాక్షి సిన్హా -యామి గౌతమ్ హీరోయిన్ గా నటించారు .
ఈ సినిమాలో పంజాబీ మస్తు అనే పాటలో హీరోయిన్ సోనాక్షి సిన్హాతో కలిసి డాన్స్ చేశాడు ప్రభాస్ . దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . ప్రభాస్ ఈ రేంజ్ లో డాన్స్ చేయగలడా అంటూ షాక్ అయిపోయారు ఫ్యాన్స్. ఓ రేంజ్ లో రెచ్చిపోతూ స్టేజ్ పై జాకెట్ తీసేసి మరి రచ్చ రంబోలా చేసే విధంగా స్టెప్స్ వేశాడు . మరెందుకు ఆలస్యం ఆ వీడియో పై మీరు ఓ లుక్ వేసి ఎంజాయ్ చేయండి..!