దట్ ఈజ్ పుష్ప రాజ్ గాడు.. తారక్ కి ఏ విధంగా విష్ చేశాడో చూడండి..వేరే లెవల్..!

ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా సరే అల్లు అర్జున్ అదే విధంగా తారక్ మధ్య ఉన్న బాండింగ్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. వీళ్ళు ఫ్రెండ్సా..? కాదు ..బంధువులు కాదు అంతకుమించిన రేంజ్ అనే చెప్పాలి . వీళ్ళ బాండింగ్ స్పెషల్ …దానికి పేరు లేదు ముద్దు ముద్దుగా బావ అని పిలుచుకుంటారు . అలా అని బంధువులు కాదు. స్నేహితులులా ఒరేయ్.. రారా.. పోరా అని పిలుచుకోరు .

కానీ స్నేహానికి మించిన ఫ్రెండ్షిప్ ను కంటిన్యూ చేస్తూ ఉంటారు . తాజాగా తారక్ బర్త్డ డే సందర్భంగా అల్లు అర్జున్ అద్దిరిపోయే రేంజ్ లో తన బావకు విషెస్ అందించాడు . “హ్యాపీ బర్త్డ డే బావ అంటూ దేవర ఫియర్ సాంగ్ ఫైర్ లా ఉంది “అనే క్యాప్షన్ జత చేశాడు . చాలామంది ఎన్టీఆర్ కి విష్ చేశారు . హ్యాపీ బర్త్డ డే అంటూ చెప్పి చేతులు దులిపేసుకున్నారు . కానీ అల్లు అర్జున్ మాత్రం చాలా స్పెషల్ గా చాలా జెన్యూన్ గా ఉన్నది ఉన్నట్లు తన ఫ్రెండ్ కం బావ తారక్ పై ట్విట్ చేశాడు .

దీంతో ఈ ట్వీట్ ను బాగా ట్రెండ్ చేస్తున్నారు అల్లు – నందమూరి ఫ్యాన్స్ . అల్లు అర్జున్ అంటేనే వేరే లెవెల్ .. పుష్ప గాడు బాగా పూనేసాడు ..అంటూ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఎన్టీఆర్ బర్త డే సందర్భంగా పలు సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. నిన్న ఫియర్ సాంగ్ కి సంబంధించిన పాట విడుదల చేయగా నేడు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో సినిమాపై అఫీషియల్ అప్డేట్ ఇచ్చాడు . 2024 ఆగస్టులో ఈ సినిమా సెట్స్ పైకి రాబోతుంది అంటూ అఫీషియల్ గా ప్రకటించాడు..!!