ఎస్ ప్రెసెంట్ ఐశ్వర్య రజనీకాంత్ చేసిన కామెంట్స్ కోలీవుడ్ మీడియాలో వైరల్ గా మారాయి. మనకు తెలిసిందే రజనీకాంత్ కూతురుగా ఐశ్వర్య బాగా పాపులారిటీ సంపాదించుకుంది . తనదైన స్టైల్ లో పలు సినిమాలను డైరెక్ట్ చేసి పరలేదు అనే ఇమేజ్ కూడా క్రియేట్ చేసుకుంది . కానీ ఆమె రజినీకాంత్ కూతురుగా ధనుష్ భార్యగానే బాగా ప్రసిద్ధి చెందింది. తమిళ్ స్టార్ హీరో ధనుష్ ఐశ్వర్య విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే .
18 ఏళ్ల సంసార జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు . అయితే వీళ్ళు ఎందుకు విడాకులు తీసుకున్నారు అనేది మాత్రం ఇప్పటికే క్లారిటీ లేదు . సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో వీళ్ళకి సంబంధించిన పలు రకాల వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే ధనుష్ గురించి ఐశ్వర్య కానీ ఐశ్వర్య గురించి ధనుష్ కానీ ఎక్కడ నెగటివ్గా మాట్లాడిన సందర్భాలు లేవు . రీసెంట్గా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ధనుష్ పై చాలా చాలా పాజిటివ్గా మంచిగా కామెంట్స్ చేసింది తన మాజీ భార్య ఐశ్వర్య.
ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ..”అనిరుధ్ ఇండస్ట్రీలోకి రావడానికి నా ప్రమేయం ఏమీ లేదు అని .. అదంతా ధనుష్ చేసాడు అని.. నిజానికి అనిరుధ్ ని విదేశాలలో చదివించాని అని అనుకున్నాం అని .. కానీ ఆయనలోని టాలెంట్ చూసి ధనుష్ సొంతంగా తన డబ్బులతో కీబోర్డ్ కొనిచ్చి మ్యూజిక్ పై ఇంట్రెస్ట్ ఉంది అని అటువైపుగా అడుగులు వేయించాడు అని ..”చెప్పుకు వచ్చింది . అంతేకాదు అనిరుధ్ ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాడు అంటే కారణం మాత్రం నేను కానే కాదు అని దానికి కారణం మొత్తం కూడా ధనుష్ అంటూ తేల్చేసింది. దీంతో ఐశ్వర్య రజనీకాంత్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!