నాగబాబుని “అమ్మ నా బూతులు” తిట్టిన తెలుగు హీరో.. అసలు ఏమైందంటే..?

నాగబాబు .. మెగా బ్రదర్ గా ఇండస్ట్రీలో బాగానే పాపులారిటీ సంపాదించుకున్నారు. ఒకప్పుడు సినిమాలలో కొన్ని కీలక పాత్రలో కనిపించారు. ఆ తర్వాత పలు సినిమాలను కూడా ప్రొడ్యూస్ చేశారు . ఆ తర్వాత పలు బుల్లితెర రియాలిటీ షో స్ కు జడ్జిగా కూడా వ్యవహరించారు. పలు ఈవెంట్స్ లో మెరిసి తనదైన స్టైల్ లో సందడి చేశారు . ప్రెసెంట్ సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈయన రాజకీయాలకు మరీ మరీ దగ్గరగా వెళ్లిపోయాడు .

కాగా నాగబాబుని గతంలో రామ్ చరణ్ బూతులు తిట్టిన ఒక న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే రామ్ చరణ్ ఎదో కావాలి అని కసి తీర్చుకోవడానికి తిట్టలేదు.. సరదాగా తెలిసి తెలియని వయసులో ఆయనను తప్పుడు మాటలతో ఫన్నీగా ఆటపట్టించారు. రామ్ చరణ్ స్కూల్ డేస్ లో చదువుకునే టైంలో కార్ డ్రైవర్ – వాచ్మెన్ అపార్ట్మెంట్ ముందు బూతులు తిట్టుకోవడం విన్నారట. ఆ టైంలో అవి బూతులు అన్న విషయం కూడా చరణ్ కి తెలియదట .

అవే మాటలను సరదాగా ఇంట్లో అందరి ముందు నాగబాబుపై మాట్లాడారట రామ్ చరణ్ . అంతే దీంతో కోపంతో ఒక్కసారిగా ఊగిపోయిన చిరంజీవి రూమ్ లోకి తీసుకెళ్లి బెల్ట్ తో లాగిపెట్టి కొట్టారట , వద్దు వద్దు అని చెప్పినా కూడా వినలేదట . అంతేకాదు ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడితే తాట తీసేస్తా అంటూ వార్నింగ్ కూడా ఇచ్చారట. ఆ తర్వాత ఆ మాటలు ఎక్కడ విన్నాడు అని తెలుసుకొని ఆ అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్లి మరి చిన్నపిల్లలు ఉన్నప్పుడు మాటలు జాగ్రత్తగా రావాలి అంటూ హెచ్చరించారట . దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా బాగా వైరల్ గా మారింది..!!