రాత్రి భోజనం తర్వాత డిసర్ట్ తీసుకుంటున్నారా.. ఎంత ప్రమాదమో తెలిస్తే ఆ అలవాటు మానుకుంటారు..

రాత్రి భోజనం చేసేసిన తర్వాత చాలామందికి డిస‌ర్ట్‌ తీసుకునే అలవాటు ఉంటుంది. కొంతమంది స్వీట్స్ తినకుండా అస్సలు డిన్నర్ కంప్లీట్ కాదు. కానీ రాత్రి భోజనం తర్వాత స్వీట్లు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా హానికరమని నిపుణులు చెప్తున్నారు. రాత్రి స్వీట్ లు తినడం వల్ల శరీరంలో ఎన్నో రకాల హానికారక సమస్యలు తలెత్తుతాయట. ఆ అనారోగ్య సమస్యలు ఏంటో.. స్వీట్లు తినడం వల్ల జరిగే ప్రమాదం ఏంటో తెలుసుకుందాం. రాత్రి భోజనం తర్వాత తీపి వంటకాలు తినడం వల్ల బరువు పెరిగే సమస్య ఏర్పడుతుంది. స్వీట్ శరీరంలోని ఇన్సులిన్ స్థాయిని పెంచి బాడీ కొలెస్ట్రాల్ పెరగడంలో కీలక పాత్ర వహిస్తాయి. అందుకే రాత్రి భోజనం తర్వాత స్వీట్లు అవాయిడ్ చేయడం మంచిది.

ఇక బరువు పెరగడమే కాదు రాత్రి భోజనం తర్వాత స్వీట్ తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ పై చెడు ప్రభావం కలుగుతుంది. జీర్ణ‌శక్తి పాడైతే రక్తప్రసరణ నియంత్రించే సిస్టం దెబ్బతింటుంది. అలాగే రాత్రిపూట స్వీట్స్ తినడం వల్ల గుండెపై ప్రభావం చూపుతుంది. చక్కెర పానీయాలు తాగడం వల్ల కూడా అధిక బరువు సమస్య ఏర్పడుతుంది. రక్తపోటు, గుండె జబ్బులు ప్రమాదం కలుగుతుంది. రాత్రిపూట స్వీట్లు తింటే శరీరంలో ఎనర్జీ లెవెల్ పెరిగి ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టదు.

దీంతో నిద్రలేమి సమస్య ఏర్పడుతుంది. ఇక రాత్రి భోజనం తర్వాత స్వీట్లు తినడం వల్ల షుగర్ లెవెల్స్‌లో ఆకస్మిక మార్పులు ఏర్పడతాయని నిపుణులు చెప్తున్నారు. ఒక్కసారి షుగర్ లెవెల్స్ ఎక్కువవ‌టం, సడన్గా షుగర్ లెవెల్స్ పడిపోయే సమస్య ఏర్పడుతుందట. దీని కారణంగా ఆందోళన, మూడు స్వింగ్స్, తలనొప్పి ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక రాత్రి పూట డిస‌ర్ట్ తీసుకునే అలవాటు ఉంటే దానిని మెల్లమెల్లగా మానేయడం మంచిది.