మరో హిట్ డైరెక్టర్ తో సినిమాకి కమిట్ అయిన చిరంజీవి.. ఈ కాంబో ఫ్యాన్స్ కూడా ఊహించలేదుగా..!?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న చిరంజీవి వరుసగా భారీ సినిమాలకు కమిట్ అవుతున్నాడు. ప్రజెంట్ విశ్వంభర సినిమా షూట్ లో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి తాజాగా మరో బిగ్ ప్రాజెక్టుకు సైన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గబ్బర్ సింగ్ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్గా మారిపోయిన హరీష్ శంకర్ దర్శకత్వంలో చిరంజీవి ఒక మూవీకి కమిట్ అయ్యాడట . పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ చిరంజీవి కుమార్తె సుస్మిత కలిపి ఈ ప్రాజెక్టును భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారట .

అంతేకాదు ఈ సినిమాకి బివిఎస్ రవి కథను అందించబోతున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఇప్పటికే స్టోరీ విన్న మెగాస్టార్ చిరంజీవి చాలా ఇంప్రెస్ అయిపోయారట. ఇది మొత్తం ఓ మెసేజ్ ఓరియెంటెడ్ ఫిలిం అట . జనాలకి చాలా చాలా ఇంపార్టెంట్ మెసేజ్ ను ఈ సినిమా ద్వారా ఇవ్వబోతున్నాడట చిరంజీవి. అంతే కాదు త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా చేయబోతున్నారట .

ఈ సినిమాకి టైటిల్ ని కూడా పెట్టేసారట . ఆటో జానీ అంటూ వింటేజ్ టైటిల్ ఓకే చేశారట . త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా రాబోతుంది అంటున్నారు సినీ ప్రముఖులు . దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది . హరిస్గ్ శంకర్ లాంటి డైరెక్టర్ కి ఛాన్స్ ఇస్తాడు చిరంజీవి అంటూ మెగా ఫాన్స్ కూడా ఊహించలేకపోయారు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ కి హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ చిరంజీవికి ఎలాంటి హిట్ ఇస్తాడు..? అంటూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్..!!