హీరోని పెళ్లి చేసుకోబోతున్న ఫరియా అబ్దుల్లా.. జాక్ పాట్ ఛాన్స్ కొట్టిందిగా..!?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీస్ వరుసగా పెళ్లిళ్లు చేసేసుకుంటున్నారు . రకుల్ ప్రీత్ సింగ్ రీసెంట్ గానే పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిలైపోయిన విషయం తెలిసిందే. త్వరలోనే పూజా హెగ్డే హీరోయిన్ తాప్సి కూడా పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . అంతేకాదు రేపు టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తన ఎంగేజ్మెంట్ ని చేసుకోబోతున్నాడు అంటూ కూడా ప్రచారం జరుగుతుంది . అలాగే త్వరలోనే యంగ్ హీరో సిద్దు జొన్నల గడ్డ కూడా పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది .

ఇలాంటి క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో చిట్టిగా పాపులారిటీ సంపాదించుకున్న ఫరీయా అబ్దుల్లా కూడా పెళ్లి చేసుకోబోతుంది అన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వెరీ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఫరీయా అబ్దుల్లా సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ సంపాదించుకుంది . పలు యూట్యూబ్ వీడియోస్ ఆమెవి బాగా వైరల్ అయ్యాయి. షార్ట్ ఫిలింస్ లో కూడా నటించి మెప్పించింది .

అయితే చిన్నప్పటినుంచి తన ఫ్రెండ్ ని ప్రేమిస్తూ వచ్చిన ఫరియా అబ్దుల్లా.. ఇప్పుడు అతగాడిని పెళ్లి చేసుకోబోతుందట . అయితే అతడు వెబ్ సిరీస్ లో హీరోగా వర్క్ చేస్తున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే ఈ విషయంపై అఫీషియల్ ప్రకటన కూడా రాబోతుందట . ఫరియా కాబోయే హస్బెండ్ ఎలా ఉంటాడో అంటూ సోషల్ మీడియాలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి
. జాతి రత్నాలు సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత పలు సినిమాలలో నటించింది . కానీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది . ఫరియా అబ్ధులా బెల్లీ డాన్స్ ఇస్తే కళ్ళు ఆర్పకుండా చూసేస్తారు ..అలా నడుమును బెల్లిని గిరగిరా తిప్పేస్తుంది..!