“అది లేకపోతే అసలు వాళ్ళు అబ్బాయిలే కాదు”.. ఫస్ట్ టైం కాంట్రవర్షియల్ కామెంత్స్ తో అడ్డంగా బుక్కైన శ్రీలీల..!?

తెలిసి చేస్తుందో తెలియక చేస్తుందో తెలియదు కానీ .. శ్రీ లీల ఈ మధ్యకాలంలో బాగానే అడ్డంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురైపోతుంది . రీసెంట్గా గుంటూరు కారంలో నటించి సోషల్ మీడియాలో తన పేరుని బూతులతో ట్రోల్ చేయించుకునింది శ్రీ లీల. అయితే ఆమె గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలను మరోసారి ట్రోల్ చేస్తున్నారు ఆకతాయిలు.

శ్రీలీల టైం బ్యాడ్ అని చెప్పడానికి ఇదే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అంటూ మరింత స్థాయిలో మీమర్‌స్ ఆడేసుకుంటున్నారు . శ్రీ లీల గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అబ్బాయిల గురించి సంచలన కామెంట్స్ చేసింది . “అబ్బాయిలకు అందం లేకపోయినా పర్లేదు కానీ .. మంచితనం సెన్సాఫ్ హ్యూమర్ .. భార్యను బాగా చూసుకోవాలని బుద్ధి గుణం ఉండాలి అని ..అది లేని వాళ్ళు అసలు అబ్బాయిలే కాదు “అనే విధంగా పరోక్షంగా చెప్పుకొచ్చింది .

దీంతో అప్పట్లో ఆమెపై చాలామంది ఘాటుగా స్పందించారు . కానీ అప్పట్లో ఆమె స్టార్ హీరోయిన్ కావడంతో జనాలు పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు ఆమె ఐరన్ లెగ్ అంటూ ట్యాగ్ చేయించుకోవడంతో ఆకతాయిలు మరోసారి ఆమెను ట్రోలింగ్కి గురి చేస్తున్నారు . సోషల్ మీడియాలో ప్రజెంట్ ఇదే న్యూస్ ట్రెండ్ అవుతుంది. కాంట్రవర్షియల్ కామెంట్స్ తో అడ్డంగా ఇరుక్కుపోయింది శ్రీలీలా అంటూ ఫ్యాన్స్ కూడా బాధపడుతున్నారు. ప్రజెంట్ శ్రీ లీల పలు సినిమాలతో బిజీగా ముందుకు దూసుకెళ్తుంది . ఆశ్చర్యం ఏంటంటే ఆమె కొత్తగా కమిట్ అయిన సినిమాలే లేవు .. అన్ని గతంలో కమిట్ అయినా సినిమాలే..!!