భార‌త్‌లో కొత్త క‌రోనా… జేఎన్ 1 వేరియంట్ ల‌క్ష‌ణాలు ఇవే…!

దేశంలో మరోసారి కోవిడ్ కేసులలో పెరుగుదల కనిపిస్తుంది. తాజా కేసులపై మంగళవారం అప్డేట్ ఇచ్చారు. 142 కేసులు నమోదు అయినట్లు కేంద్రం ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 1,970 కి చేరింది. కొత్త వేరియంట్ జేఎన్.1 వేరియంట్ కేసులు వెలుగు చూస్తున్న నేపథ్యంలో రాష్ట్రాలను కేంద్ర అప్రమత్తం చేస్తుంది.

ఇక ఈ వ్యాధి లక్షణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ వ్యాధి సోకిన వారికి జ్వరం, ముక్కు కారడం, గొంతు నొప్పి, తలనొప్పి.. కొందరిలో కడుపునొప్పి, మరికొందరిలో శ్వాసకోశ సమస్యలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు పూర్తిస్థాయిలో కనిపించడానికి నాలుగు నుంచి ఐదు రోజుల సమయం పడుతుంది.

గత వేరియంట్ లతో పోలిస్తే జేఎన్.1 ప్రమాదకరమైందని చెప్పడానికి ఇప్పటికైతే శాస్ర్తీయ కారణాలు లేవు. పైగా ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం కూడా లేదు అని వైద్యకులు అంటున్నారు. కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు సైతం చెబుతున్నారు. బదులుగా ఇన్ఫెక్షన్ సోకకుండా చేతులు మాస్కులు ధరించడం, శుభ్రత పాటించడం లాంటివి చాలా ముఖ్యం.