నాని ” హాయ్ నాన్న ” యూఎస్ లేటెస్ట్ వసూళ్లు ఇవే… చూస్తే ఆశ్చర్య పోవాల్సిందే…!

నాచురల్ స్టార్ నాని హీరోగా.. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా.. శౌర్యవ్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ లవ్ అండ్ అట్రాక్షన్ మూవీ ” హాయ్ నాన్న “. ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులని ఏ రేంజ్ లో ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ప్రస్తుతం ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతుంది.

నాని కెరీర్ లో మరో హిట్గా నిలిచిన ఈ మూవీ యూఎస్ లో కూడా సూపర్ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. ఈ సినిమా ఇప్పటివరకు 1.7 మిలియన్ యుఎస్ డాలర్లను రాబట్టడం జరిగింది. ఇది సూపర్ రెస్పాన్స్ అనే చెప్పాలి. లాంగ్ రన్ లో 2 మిలియన్ క్లబ్ లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో నాని పాత్రకు ఎంతోమంది ప్రేక్షకులు సైతం ఏర్పడ్డారు.

తండ్రి, కూతురు మధ్య ఉన్న అనుబంధంతో తెరకెక్కిన ఈ మూవీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో నటించిన మృణాల్ కి సైతం మంచి పాపులారిటీ దక్కిందనే చెప్పాలి. అలాగే ఈ సినిమాలో నటించిన మరో హీరోయిన్ శృతి హాసన్ కి సైతం ప్రశంసలు దత్తాయి. ఈమెది చిన్న పాత్ర అయినప్పటికీ మంచి ప్రాధాన్యత దక్కింది.