రెండో పెళ్లి పై ఫుల్ క్లారిటీ ఇచ్చిపడేసిన సమంత… ఏం గట్స్ రా బాబు..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఏం మాయ చేసావే అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలోనే నాగచైతన్యతో ప్రేమలో పడింది సామ్.‌ ఇక 7 సంవత్సరాల పాటు వీరిద్దరూ ప్రేమించుకుని.. 2017వ సంవత్సరంలో వివాహం చేసుకున్నారు.

పెద్దల సమక్షంలో వీరిద్దరూ ఒక్కటయ్యారు. కానీ 2021వ సంవత్సరంలో కొన్ని అనుకోని కారణాలవల్ల ఈ జంట విడిపోయారు. ఇక ఇది ఇలా ఉంటే.. ఈ జంట విడిపోయిన నాటి నుంచి నేటి వరకు ఏదో ఒక రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. అదేవిధంగా సమంత రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.

( Photos : Instagram )

ఇక తాజాగా రెండో పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది సమంత. రెండో పెళ్లి ఎందుకు చేసుకోవడం లేదు అని సమంతాను ఓ నెటిజన్ అడగగా…” ఇండియాలో రెండవ పెళ్లి మరియు మూడవ పెళ్లికి విడాకుల రేటు ఎక్కువగా ఉంది ” అంటూ సరదాగా సమాధానం ఇచ్చింది. ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.