కళ్యాణ్ రామ్ ” డెవిల్ ” మూవీ నుంచి ” దూరమే తీరమై ” లిరికల్ సాంగ్ రిలీజ్.. ఇది కధ మజా అంటే..!

కెరీర్ స్టార్టింగ్ నుంచి డిఫరెంట్ మూవీస్ తో తనదైన గుర్తింపు సంపాదించుకుంటున్న వారిలో నందమూరి కళ్యాణ్ రామ్ ఒకరు. ఈయన తాజాగా నటిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” డెవిల్ ” పై భరీ అంచనాలు నెలకొన్నాయి. ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనేది ఈ మూవీకి ట్యాగ్ లైన్.

అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామా దర్శక నిర్మాతగా ఈ మూవీని రూపొందిస్తున్నాడు. డిసెంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ భారీ ఎత్తున విడుదలవ్వరుంది. ఇగ ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, సాంగ్స్, టీజర్ సూపర్ రెస్పాన్స్ ని దక్కించుకున్నాయి.

ఇక ఈ నేపథ్యంలోనే సోమవారం మేకర్స్ ఈ సినిమా నుంచి ” దూరమే తీరమై ” అనే లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. ఇక సమీర భరద్వాజ్ ఈ పాటను రాసి పాడటం గమనార్హం. ఇక ఈ సినిమాపై నందమూరి ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకున్నాయి. ఇక ఈ మూవీ రిలీజ్ అనంతరం ప్రేక్షకులని ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాల్సి ఉంది.