టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌లకు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ రావడం అనేది సాధారణ విషయం కాదు. కానీ శృతిహాసన్ ఏడాదిలోనే ఇద్దరు సీనియర్ స్టార్ హీరోలతో జంట కట్టి బ్లాక్ బాస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. 2023 అనేది శృతిహాసన్ కెరీర్‌లోనే బెస్ట్ ఇయర్‌గా చెప్పుకోవచ్చు. ఈ ఏడాదిలో ఇప్పటికి రెండు హిట్స్ ఉన్నా మూడో హిట్ తన ఖాతాలో వేసుకోవడానికి సిద్ధంగా ఉంది. అదే ప్రభాస్‌తో కలిసి నటించిన సలార్ ఈ మూవీపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. డిసెంబర్ 22న గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు శృతిహాసన్ హీరోయిన్గా నటించింది. ప్రస్తుతం సలార్ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా శృతిహాసన్ ఇంటర్వ్యూలో సందడి చేసింది.
ఈ ప్రమోషన్స్ లో భాగంగా సినిమా గురించి, ప్రభాస్ గురించి మాత్రమే కాకుండా తన పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకుంది. ఇప్పటికే ఈ ఏడాది రెండు వరస బ్లాక్ బాస్టర్ హిట్‌లను మీ ఖాతాలో వేసుకున్నారు.. ఈ ఫీలింగ్ ఎలా ఉంది అని శృతిని అడగగా ఈ ఏడాది నాకు ఓ రోలర్ కోస్టర్ రైడ్ లా ఉంది. చివరికి వచ్చేసరికి చాలా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నా.. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది అంటూ చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం ఈ మూవీలో ఆధ్యా పాత్రలో నేను నటిస్తున్నానని శృతి వివరించింది. స్టోరీని ప్రభాస్ రన్ చేస్తున్న దేవా పాత్రను మాత్రం పూర్తి చేసేది ఆధ్యా అంటూ చెప్పుకొచ్చింది.
ఆధ్యా చాలా ఓపికగా, సహనంగా ఉండే అమ్మాయి తను అనుకోని సంఘటనలో చిక్కుకుంటుంది అంటూ చెప్పుకొచ్చింది. ఆ పాత్రను పోషించడం నాకు ఎంతో ఇంట్రెస్టింగ్‌గా అనిపించిందని చెప్పిన శృతి.. ప్రభాస్, ప్రశాంత్ నీల్‌తో కలిసి పనిచేయడం పై తన అనుభవాలను షేర్ చేసుకుంది. ప్రశాంత్ గురించి శృతి మాట్లాడుతూ నాకు అతనితో పని చేయడం చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్.. అతను చాలా అద్భుతమైన పర్సన్.. తన విజన్, తన సృష్టించే విధానం, డైరెక్టర్‌గా తన పని తీరు అని చాలా నచ్చుతాయి అంటూ చెప్పిన శృతి.. ఆ మూవీలో నటించే యాక్టర్స్ తోనే కాక యూనిట్లో ప్రతి ఒక్కరితో ప్రేమగా మాట్లాడుతాడని చెప్పుకొచ్చింది.
అలాంటి గ్రేట్ డైరెక్టర్ తో వర్క్ చేయడం చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని.. అదే విధంగా ప్రభాస్ తో కూడా చాలా సరదాగా షూటింగ్ జరిగిపోతుందని ప్రభాస్ లాంటి ఫ్రెండ్ నాకు ఉన్నాడని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉందంటూ చెప్పుకొచ్చింది. పని విషయంలో చాలా డెడికేషన్ గా ఉంటాడని.. ప్రతి ఒక్కరు ఆ సినిమాలో పనిచేస్తున్నందుకు హ్యాపీగా ఫీల్ అయ్యే విధంగా ప్రవర్తిస్తాడని.. ప్రశాంత్ నీల్.. ప్రభాస్ లో ఉండే కామన్ పాయింట్ ఇదే అంటూ చెప్పుకొచ్చింది. ఇక సెట్స్ లో ఎప్పుడు ఖాళీ దొరికిన ప్రభాస్ ని విసిగిస్తూ ఉండే దానిని.. జనరల్ నాలెడ్జ్, మ్యూజిక్ ఇలా సినిమాకు సంబంధం లేని విషయాలను అడుగుతూ ఇరిటేట్ చేసే దానినని చెప్పుకొచ్చింది. తను నవ్వి ఊరుకునేవాడని ప్రభాస్ కంటే ఎక్కువగా నేనే మాట్లాడతానంటే చెప్పుకొచ్చింది.