పవర్ఫుల్ విజువల్స్ తో ఆకట్టుకుంటున్న ‘ హనుమాన్ ‘ .. ట్రైలర్ చూస్తే గూస్ బంప్సే (వీడియో)..

యంగ్ హీరో తేజ స‌జ్జా కీలకపాత్రలో నటిస్తున్న మూవీ హనుమాన్. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెల‌కొన్నాయి. ఇప్పటికే సినిమా పూర్తయిన కంటెంట్ పై ఉన్న నమ్మకంతో సంక్రాంతి బరిలో ఎలాగైనా సక్సెస్ సాధిస్తుందని మెక‌ర్స్‌ సినిమాను ఇప్పటివరకు పోస్ట్ పోన్ చేశారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి పాటలు, ట్రైలర్ రిలీజ్ కాగా.. పాటలు ఊహించిన రేంజ్ లో హైప్‌ సాధించలేకపోయినా.. ట్రైలర్ మాత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ ట్రైలర్ కట్స్ తో సినిమాలో ఖ‌చ్చితంగా కంటెంట్ ఉంటుందనే అంచనాలు ప్రేక్షకుల్లో నెలకొన్నాయి.

HANUMAN Official trailer : Announcement | Teja Sajja, Prashanth Verma, Hanuman movie trailer (2023) - YouTube

ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అసలు సిస‌లు ఆయుధం ట్రైలర్ రిలీజ్ అయింది. తేజ సబ్జా క్యారెక్టర్ తో స్టార్ట్ అయిన ఈ ట్రైలర్ సముద్రంలో విజువల్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఎంతో బలంగా ఉండి ప్రతి ఒక్కరికి తోడు ఉంటాడు హనుమాన్. రాబోయే ఇబ్బందులను ఎదుర్కోడానికి ఎలా సిద్ధంగా ఉన్నాడు అనే అంశాలను ట్రైలర్‌లో చూపించారు. ఎక్స్టర్నల్ పవర్స్‌ కోసం ఆరాటాపడుతూ ఉండే విలన్స్ హీరో గురించి తెలుసుకొని అతని ఓడించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. పవర్స్ కోసం ఎలాంటి పని నైనా చేసే విలన్స్‌ని హీరో ఎలా ఓడించాడు.. అనే అంశాన్ని ట్రైలర్ లో చూపించారు. తర్వాత హనుమాన్ క్యారెక్టర్ కూడా ఏ విధంగా హైలెట్ కాబోతుంది.. అని క్యూరియాసిటీ ఈ ట్రైలర్ ద్వారా క్రియేట్ చేశాడు డైరెక్టర్.

విజువల్స్ తో అద్భుతంగా చూపించిన ఈ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటుంది.  ఫినిషింగ్ టచ్గా రామ్ అనే బేస్ వాయిస్తూ వచ్చిన సీన్స్ అయితే ప్రేక్షకులకు గూస్ బంప్సే తెప్పించేలా ఉన్నాయి.తక్కువ బడ్జెట్ అయినప్పటికీ దర్శకుడు విజువల్స్ తో తనదైన స్టైల్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇక తేజ్ క్యారెక్టర్ అలాగే అతడి సోదరిగా యాక్ట్ చేస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండబోతున్నాయని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. మొత్తానికి సినిమాలో గ్రాఫిక్స్ కూడా అద్భుతంగా ఉంది అనడానికి ట్రైలర్‌ షార్ట్స్ నిదర్శనం.

Hanuman : Official Trailer Teaser | Teja Sajja| Amritha Aiyer, Prashant Verma | Hanuman Trailer - YouTube

సినిమాలో ట్రైలర్ కి తగ్గట్టుగానే విజువల్స్ క్లిక్ అయితే సంక్రాంతి పోటీలో హనుమాన్ మినిమ‌మ్‌ హిట్ ఇవ్వడం గ్యారెంటీ. ఇక ఈ సినిమా కి హిందూ సెంటిమెంట్ తోడైతే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపించడం ఖాయమని చెప్పవచ్చు. ఇక సంక్రాంతి కానుక జనవరి 12న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఊహించిన రేంజ్ లో సక్సెస్ అందుకుంటుందో లేదో వేచి చూడాలి.