” నాకు, కత్రినాకు ఈ దివాలి ఎంతో ముఖ్యం “… సల్మాన్ ఖాన్ సెన్సేషనల్ కామెంట్స్…!!

టాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ , బోల్డ్ బ్యూటీ కత్రినా కైఫ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. కత్రినా తన అందంతో, నటనతో ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. వీరిద్దరూ కలిసి నటిస్తున్న తాజా మూవీ..” టైగర్ 3 “. ఈ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకి గ్రాండ్ గా రానుంది. ఈ క్రమంలోనే వరుస ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు ఈ మూవీ టీం.

ఈ క్రమంలో సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ…” టైగర్ 3 దీపావళికి రిలీజ్ కావడం ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే పండగ రోజు సినిమా రిలీజ్ అంటే ప్రేక్షకులు ఆశీర్వదించడానికి ఎక్కువ ఇష్టపడతారు. దీపావళి రోజున విడుదలైన నా సినిమాలు తీపి గుర్తులుగా మిగిలిపోయాయి. కానీ.. నాకు, కత్రినాకు మాత్రం ఈ దివాలి చాలా ముఖ్యం.

ఎందుకంటే ఇప్పటివరకు మేము ఇద్దరం కలిసి నటించిన ఏ సినిమా కూడా దివాళికి రిలీజ్ కాలేదు. తొలిసారి టైగర్ 3 రిలీజ్ కానుంది. అందువల్ల నేను, కత్రినా ఎంతో సంతోషంగా, ఆసక్తికరంగా ఉన్నాము. మీరు మమ్మల్ని దీవిస్తారని మేము అనుకుంటున్నాము ” అంటూ పేర్కొన్నాడు. ప్రస్తుతం సల్మాన్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.