టాలీవుడ్ లో విషాదం.. సీనియర్ నటుడు చంద్రమోహన్ మృతి..!!

టాలీవుడ్ లో గతంలో ఎన్నో ఫ్యామిలీ చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న విలక్షణమైన నటుడు చంద్రమోహన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకోలేకపోయినా ఎన్నో చిత్రాలలో నటించి మంచి క్రేజీ సంపాదించుకున్నారు. తన విలక్షణమైన నటనతో మంచి క్రేజీ సంపాదించుకున్న చంద్రమోహన్ కేవలం హీరో గానే కాకుండా సహాయ నటుడి పాత్రలో హాస్యనటుడిగా కూడా మంచి క్రేజ్ అందుకున్నారు.


ఇటీవల కాలంలో పలు సినిమాలలో కీలకమైన పాత్రలలో నటిస్తున్న చంద్రమోహన్ తాజాగా కన్నుమూసినట్లుగా తెలుస్తోంది. భాగ్యనగరంలోని ప్రముఖ ఆసుపత్రిలో 9 గంటల 45 నిమిషాలకు తుది శ్వాస విడిచినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం చంద్రమోహన్ వయసు 82 సంవత్సరాలు ఈయనకు ఒక భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చంద్రమోహన్ భార్య పేరు జలంధర.. ఇద్దరు కుమార్తెలకు సైతం వివాహం చేయడం జరిగింది. సోమవారం రోజున చంద్రమోహన్ కు సంబంధించి అంత్యక్రియలు నిర్వహిస్తారని కుటుంబ సభ్యులు సైతం తెలియజేస్తున్నారు. అయితే చంద్రమోహన్ మరణ వార్త విని సినీ సెలబ్రిటీలతోపాటు అభిమానులు కూడా కాస్త తీవ్ర నిరాశకు లోనయ్యారు.

చంద్రమోహన్ దాదాపుగా స్టార్ హీరోల చిత్రాలలో కూడా మల్టీస్టారర్ సినిమాలలో నటించి మంచి క్రేజ్ అందుకున్నారు. గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్న చంద్రమోహన్ ఈ రోజున ఆరోగ్యం విషమించడంతో మరణించినట్లుగా తెలుస్తోంది.. ఈయన మరణ వార్త విని అభిమానుల సైతం శోకసముద్రంలోకి మునిగిపోయారు. పలువురు సెలబ్రిటీలు సైతం ఈయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు.