బ‌న్నితో రొమేంటిక్ పిక్ షేర్ చేసిన స్నేహా.. అమ్మ‌డు ఇంత రొమాంటికా..

టాలీవుడ్ స్టార్ కపుల్ లో అల్లు అర్జున్ – స్నేహ రెడ్డి జంట ఒకటి. ఇక ఇటీవల బెస్ట్ యాక్టర్ గా అల్లు అర్జున్ నేషనల్ అవార్డు అందుకున్న సంగ‌తి తెలిసిందే. ఇక అత‌డి భార్య స్నేహ రెడ్డి ఎటువంటి సినిమాల్లో నటించకపోయిన సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఎప్పటికప్పుడు ఫోటోలు, వీడియోలు, ఫ్యామిలీ విషయాలు సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటూ ఉంటుంది ఈ అమ్మడు.

ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ స్టోరీలలో తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను తన పిల్లలు అర్హ, అయాన్‌కి సంబంధించిన విషయాలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ ను ఖుషి చేస్తుంది. తాజాగా బన్నీ – స్నేహ రెడ్డికి సంబంధించిన ఓ రొమాంటిక్ పిక్ ను సోషల్ మీడియా వేదికపై షేర్ చేసుకుంది స్నేహ. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసిన ఆ పిక్ ఇప్పుడు వైరల్ గా మారింది. బన్ని ని కౌగిలించుకొని బుగ్గపై కిస్ చేస్తున్న ఫోటోని స్నేహ షేర్ చేసుకుంది.

ఇక బన్నీ ఫేస్ కనిపించకుండా వెనక్కు తిరిగి నుంచున్నాడు. ఈ ఫోటోలో ట్రెడిషనల్ లుక్ లో దర్శనమిచ్చారు ఈ క్యూట్ కపుల్. దీంతో ఈ ఫోటోను సోష‌ల్ మీడియాలో వైరల్ చేస్తూ ఫ్యాన్స్, నెట్టిజన్స్ క్యూట్ కపుల్ అంటూ.. రొమాంటిక్ క‌పుల్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం బ‌న్ని పుష్ప 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే సంవత్సరం ఆగస్టు 15న రిలీజ్ కానుంది.