సిక్స్ ప్యాక్ బాడీ తో హాట్ ట్రీట్ ఇస్తున్న ఈ టాలీవుడ్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో కథకు తగ్గట్టుగా కనిపించేందుకు హీరోలు మాత్ర‌మే6 ప్యాక్ లు 8 ప్యాక్ లు మెయింటైన్ చేస్తూ ఉంటారు. హీరోయిన్ల‌కు ఆ అవ‌స‌రం ఉండ‌దు. వాళ్ళు కూడా జిమ్ కి ఫిట్నెస్ సెంటర్ కి వెళ్తుంటారు.. కానీ సిక్స్ ప్యాక్ బాడీ ఎవరు మెయింటైన్ చేయరు. అది చాలా కష్టం కూడా. అలాంటిది టాలీవుడ్ కి చెందిన ఓ క్రేజీ బ్యూటీ సిక్స్ ప్యాక్ బాడీతో ఫ్యాన్స్‌కి షాక్ ఇచ్చింది. ఇంతకీ పై ఫోటోలో కనిపిస్తున్న ఆ అందాల తార ఎవరో గుర్తుపట్టారా.. తెలుగులో అతి తక్కువ సినిమాల్లో నటించినప్పటికీ స్టార్ బ్యూటీగా మంచి క్రేజ్‌ అందుకుంది. ఆమె కేవలం రెండు సినిమాల్లో నటించగా రెండు సినిమాలు మంచి హిట్ అందుకున్నాయి. ఇక ఈ బ్యూటీ సినిమాల్లోకి రాకముందు మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకుంది.

ప్రొఫెషనల్ బాక్సర్ గా ఉన్న ఈ ముద్దుగుమ్మ 20 మ్యాచ్లలో పార్టిసిపేట్ చేయగా 17 మ్యాచులను గెలిచింది. అనుకోకుండా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరో ఇప్పుడైనా గుర్తుపట్టారా? ఆమె రితికా సింగ్.. విక్టరీ వెంకటేష్ గురు సినిమాలో లేడీ బాక్సర్ గా అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. ఎస్.. ఈ సిక్స్ ప్యాక్ బ్యూటీ రితిక సింగే. సినిమాల్లో నటిస్తూనే మరోవైపు ప్రొఫెషనల్ బాక్సింగ్ వైపు కూడా దృష్టి సారిస్తుంది. ఆ సిక్స్ ప్యాక్ బాడీని మెయింటైన్ చేయడానికి తగ్గట్టుగా కఠినకసరత్తులు చేస్తుంది. తాజాగా తన సిక్స్ ప్యాక్ లుక్ తో ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా కోట్లాదిమంది ప్రేక్షకులు ఆ పిక్స్ ను వీక్షించారు.

అవి ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఇక కోలీవుడ్ డైరెక్టర్ సుధాకొంగ‌ర‌ డైరెక్షన్లో మాధవన్ హీరోగా నటించిన సాల ఖ‌దుర్‌ సినిమాలో హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. నిజ జీవితంలో ప్రొఫెషనల్ బాక్సర్ గా ఉన్న రితిక ఈ సినిమాలోను అదే పాత్రలో నటించింది. సినిమా సూపర్ హిట్ కావడంతో రితికకు అవకాశాలు పెరిగాయి. ఇదే మూవీని గురూ పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ఈ సినిమాలోను రితిక సింగ్ హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లో నటించి మెప్పించింది. అలాగే ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్ లో నటిస్తూ బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ.