” పుష్ప 2 “లో సామ్… ఈసారి సాంగ్ మాత్రమే కాదు… సీన్స్ లోనూ ఏమాత్రం సిగ్గు పడకుండా అలా చేసేస్తుందట…!!

సమంత ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన అందంతో, నటనతో ఎంతోమంది కుర్రాళ్ళని ఆకట్టుకుంది. అంతేకాదు ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. వయ్యారాలు పోతూ ఫోటోలు సైతం షేర్ చేస్తుంది. ఇక ” పుష్ప ” సినిమాలో ” ఊ అంటావా మావా ” అంటూ ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఓవర్ నైట్ లోనే పాన్ స్టార్ అయిపోయింది.

ఇక దీనికి సీక్వెల్ గా వస్తున్న ” పుష్ప 2″ కోసం సౌత్తో పాటు నార్త్ ఇండియన్స్‌ కూడా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే పుష్ప టీం ఓ క్రేజీ బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో సమంత కేవలం ఐటమ్ సాంగ్ కి మాత్రమే కాదట.. కొన్ని సీన్స్ లో కూడా కనిపించనుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. రీసెంట్ గా హైదరాబాద్లో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కావడంతో.. త్వరలో సమంత జాయిన్ కాబోతుందని సమాచారం.

అయితే అనారోగ్యం కారణంగా ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ బ్యూటీ.. నిజంగానే పుష్ప 2 లో చేయబోతుందా అని అంశంపై అభిమానులు నెట్టింట కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇది క‌నుక నిజమైతే.. వన్ ఇయర్ గ్యాప్ ఇచ్చిన ఈ బ్యూటీ కి మంచి హిట్ ఖాతాలో పడుతుంది. ఈ వార్త నిజమవ్వాలని సతవిధాలుగా కోరుకుంటున్నారు ప్రేక్షకులు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.