అలాంటి సన్నివేశాలలో నటించమని ఒత్తిడి చేశారు.. హీరోయిన్ వాణి భోజన కామెంట్స్ వైరల్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి కోలీవుడ్ హీరోయిన్ వాణి భోజన్ మొదటిసారి మీకు మాత్రమే చెప్తా అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో ఆమెకు పెద్దగా గుర్తింపు రాకపోయింది. తమిళంలో ఓ మై కడవులే అనే సినిమాలో నటించి మంచి క్రేజ్ అందుకుంది.బుల్లితెర నటిగా 2010లో తన కెరీయర్ని ప్రారంభించిన ఈమె హీరోయిన్గా బిజీ అయిపోయింది.ఇప్పటివరకు సరైన బ్లాక్ బాస్టర్ సినిమా మాత్రం పడలేదు.. కొన్ని చిత్రాలలో నటించిన కోలీవుడ్లో సక్సెస్ కోసం పోరాడుతూనే ఉంది వాణి భోజన్.

దాదాపుగా స్టార్ హీరోయిన్ హోదా కోసం 13 ఏళ్లుగా కష్టపడుతూనే ఉంది ఈ ముద్దుగుమ్మ ఎక్కువగా కోలీవుడ్ వైపే దృష్టి సాధించిన వాణి ఈమె చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి.అందులో రెండు చిత్రాలు షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ తను నటించే సినిమా కథకు అవసరం లేకపోయినా కొన్ని సన్నివేశాలలో నటించాలని చాలా ఒత్తిడి తెచ్చారని ఆవేదన చేస్తోంది.

ఒక సినిమాలో అనవసరంగా బెడ్రూం సన్నివేశాలు నటించాలని ఒత్తిడి తెచ్చారని.. అది ముందుగా ఎలాంటి సమాచారం చేయకుండానే అడిగారని దింతో తాను అలాంటి సన్నివేశాలలో నటించానని మొహం మీద చెప్పేశానని తెలిపింది వాణి భోజన్. తనకు డబ్బు మాత్రమే ముఖ్యం కాదని తన నటించే సినిమాలలో తన పాత్ర కూడా ముఖ్యమేనని తెలియజేసింది. అయితే తరచూ గ్లామర్ ఫోటోలను సోషల్ మీడియాలో విడుదల చేస్తూ తెగ హల్చల్ చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. గతంలో ఒక నటుడుతో ప్రేమాయణం సహజీవనం చేసినట్లుగా కూడా వినిపిస్తూ ఉంటాయి.