టాలీవుడ్ లో చంద్రమోహన్ బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరేనా.. అంత క్లోజ్ గా ఉండేవారా..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ న‌టుడిగా గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ స్టార్ హీరో చంద్రమోహన్ కొంతసేపటి క్రితం మృతి చెందారు. గత కొంతకాలంగా షుగర్ తో పాటు పలు వ్యాధులతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించారు. అయితే తన సినీ కెరీర్‌లో 975 సినిమాలకు పైగా టాలీవుడ్ సినిమాలలో నటించిన ఆయన 175 సినిమాల్లో హీరోగా రాణించాడు. చంద్రమోహన్ తో పాటు నటించిన హీరోయిన్స్ అంతా టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ గా మారి తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నారు. ఇలా చంద్రమోహన్ తో నటించే హీరోయిన్స్ స్టార్ హీరోయిన్స్ అవుతారని మంచి సెంటిమెంట్ చంద్రమోహన్ సినీ కెరీర్‌లో కొనసాగింది.

అయితే ఇన్ని దశాబ్దాల చంద్రమోహన్ సినీ కెరీర్‌లో ఆయనకు టాలీవుడ్ లో ఇద్దరు స్టార్ హీరోలైన సూపర్ స్టార్ కృష్ణ, దివంగత సీనియర్ నటుడు శోభన్ బాబు అత్యంత సన్నిహితులుగా ఉండేవారు. ఇక శోభన్ బాబుతో అయితే ఆయన తన పర్సనల్ విషయాలు ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటూ ఉండేవారట. శోభన్ బాబు చంద్రమోహన్ కు ఒక్కొక్కసారి తన పర్సనల్ విషయాల్లో ఇది చేస్తే మంచిది ఇలా చేస్తే మంచిది కాదు అంటూ హెచ్చరిస్తూ ఉండేవాడుట. అంత ఫ్రెండ్‌షిప్ వారి మ‌ధ్య ఉండేది.

ఇక గతంలో చంద్రమోహన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఆయ‌న‌ మాట్లాడుతూ నాకు టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత సన్నిహితులు కృష్ణ గారు, శోభన్ బాబు అంటూ చెప్పుకొచ్చాడు. నేను కొన్ని సంద‌ర్భల‌లో శోభన్ బాబు గారి మాట వినలేదు. అందుకే రూ.100 కోట్ల ఆస్తి పోగొట్టుకున్నాను. కొంపల్లి దగ్గర గొల్లపూడి మారుతీ రావు గారి మాటలు విని రూ.35 ఎకరాలు ద్రాక్ష తోట తీసుకున్న.. కానీ మేనేజ్ చేయలేక అమ్మేశా. అలాగే చెన్నైలో 15 ఎకరాలు అమ్మేశా. శంషాబాద్ దగ్గర ఆరు ఎకరాలు కొన్న అది కూడా అమ్మేశా. శోభన్ బాబు గారు వద్దని వారించిన నేను వినకుండా అలా దాదాపు రూ.100కోట్ల‌ ఆస్తి పోగొట్టుకున్న అంటూ చెప్పుకొచ్చాడు.