బుల్లితెర షోస్ లో నెంబర్ వన్ స్థానంలో ఉన్న ” జబర్దస్త్ ” గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ షో ఎంతోమంది నటులకు లైఫ్ ఇచ్చిందని చెప్పొచ్చు. ముందుగా ఈ షోకు యాంకర్ గా చేసిన అనసూయ… ప్రస్తుతం సినిమా ఆఫర్స్ తో దూసుకుపోతుంది. ఇక అనంతరం రష్మిక సైతం అనేక షోలలో యాంకరింగ్ చేస్తూ.. లైఫ్ ని సెట్ చేసుకుంటుంది. అయితే ప్రస్తుతం ఈ షోకు బిగ్ బాస్ బ్యూటీ సిరి హనుమంతు యాంకర్ గా వ్యవహరిస్తున్న సంగతి మనకి తెలిసిందే.
ప్రస్తుతం ఈమెకు ముందు అనసూయ, రష్మీ, సౌమ్య యాంకరింగ్ చేసి వారి లైఫ్ని సెట్ చేసుకున్నారు. అంతేకాదు గట్టి రెమ్యూనరేషన్ పుచ్చుకుంటూ సెటిల్ అయ్యారు. ప్రస్తుతం వీరి ప్లేస్ లో సిరి రావడంతో ఈమెకి ఎంత రెమ్యూనిరేషన్ ఇస్తున్నారు అనే సందేహం అందరిలోనూ కలిగింది. ఇంతకముందు యాంకర్లు.. ఒక ఎపిసోడ్ కు వచ్చి రూ. 2 లక్షల వరకు తీసుకునేవారు .
కానీ సిరి మాత్రం ఏకంగా రూ. 3.5 లక్షలు అందుకుంటుందని సమాచారం. ఈమె ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటుంది అంటే మామూలు విషయం కాదు. ఇది విన్న ప్రేక్షకులు…” ఈమె పనే బాగుందిగా.. అంత అందం ఉన్న అనసూయ సైతం అంత డబ్బు తీసుకోలేదు. కానీ ఈ బ్యూటీ మాత్రం ఏకంగా ఇంత రెమ్యునరేషన్ పుచ్చుకుంటుంది. ఈమెని కొన్ని రోజుల్లో హీరోయిన్ గా చూస్తామేమో ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.