అప్పుడు సిరివెన్నెల సీతారామ శాస్త్రీ..ఇప్పుడు చంద్ర మోహన్.. మరణంలోను ఎవ్వరికి దక్కని అదృష్టం..!

సినిమా ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి . ఒక సెలబ్రిటీ మరణించిన తాలూకా విషాదఛాయలు మరవకముందే మరో స్టార్ సెలబ్రిటీ మరణిస్తూ ఉండడం సినీ లవర్స్ కు తీవ్ర శోకాని మిగులుస్తుంది. రీసెంట్ గా కొద్దిసేపటి క్రితమే టాలీవుడ్ సీనియర్ నటుడు చంద్రమోహన్ మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యం తో బాధపడుతున్న ఈయన హైదరాబాద్లోని అపోలో హాస్పిటల్స్ లో చికిత్స తీసుకుంటూ కొద్దిసేపటి క్రితమే తుది శ్వాస విడిచారు.

ఈ ఊహించని పరిణామంతో ఆయన అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు . అంతేకాదు ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రగాఢ సంతాపం తెలుపుతున్నారు. పలువురు స్టార్ సెలబ్రిటీస్ సీనియర్ హీరోలు ఆయనతో వర్క్ చేసిన ప్రముఖులు ఆయన మరణం పట్ల చింతిస్తూ ఆయనతో ఉన్న స్పెషల్ బంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు . అయితే ఇలాంటి క్రమంలోనే ఆయన అభిమానులు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ట్రెండ్ చేస్తున్నారు .

చంద్రమోహన్ ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి ఆయన ఇండస్ట్రీ నుంచి బయటకు వెళ్లే వరకు ..మరణించే వరకు ఎక్కడా కూడా ఆయనపై నెగటివ్ రిమార్క్ అనేది లేదు .ఆయనతో వర్క్ చేసిన వాళ్లు కూడా ఆయన గురించి పాజిటివ్ గానే స్పందిస్తూ వచ్చారు. అంతేకాదు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు లాగే ఆయన మరణం కూడా చాలా ప్రశాంతమైనది అని ..ఇద్దరు కూడా ఇండస్ట్రీలోకి మంచి పేరుతో వచ్చి అలాంటి మంచి పేరుతోనే తుది శ్వాస విడిచారు అని మరణంలోనూ వీళ్ల ఇద్దరికీ మంచి అదృష్టం దక్కింది అని కామెంట్స్ చేస్తున్నారు .

చాలామంది స్టార్ సెలబ్రిటీస్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో బాగానే అనిపించుకున్న చివరిలో మాత్రం నిందల పాలవుతూ ఉంటారు . కానీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు అలాగే చంద్రమోహన్ గారు ఇండస్ట్రీలో ఒక్క రిమార్కు లేకుండా పైపైకి ఎదిగి జనాలు చేత శభాష్ అనిపించుకొని నెగటివ్ రిమార్కు లేకుండా పాజిటివ్ కామెంట్స్ దక్కించుకొని అంతే ప్రశాంతంగా మరణాన్ని పొందారు ప్రజెంట్ ఇదే న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు..!!