చంద్రమోహన్ కు సినీ ఇండస్ట్రీ నేర్పిన ఒక గొప్ప గుణపాఠం అదేనట..!!

ఏ ఇండస్ట్రీలో నటీనటులైన మొదట హీరోగా పలు సినిమాలలో నటించి ఆ తర్వాత కమెడియన్గా నిలదొక్కుకోవడం అంటే చాలా కష్టము..ముఖ్యంగా చెప్పే డైలాగులు అందరిని ఆకట్టుకునే విధంగా ఉండాలి ప్రేక్షకులను కూడా తన కామెడీతో నవ్వులు పూయించేలా ఉండాలి.. అలా ఎంతోమంది ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించి మంచి క్రేజీ సంపాదించుకున్న నటుడు చంద్రమోహన్ ఈరోజు ఉదయం అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ 9:45 నిమిషాలకు కన్నుమూసినట్లుగా తెలుస్తోంది.

అయితే గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న చంద్రమోహన్ సినీ జీవితంలో తను నేర్చుకున్న ఒక గుణపాఠం గురించి తెలియజేశారు.. చంద్రమోహన్ మాట్లాడుతూ షూటింగ్ సమయాలలో తన మూడు ఎలా ఉన్నప్పటికీ కెమెరా ముందు మాత్రం చాలా నవ్వుతూ కనిపిస్తూ ఉంటారు.. ప్రేక్షకులు ప్రతిసారి కూడా తన నుంచి కొత్తదనం కోరుకునే వారు ఈ విషయంలో తనకు చాలా ఇబ్బందిగా అనిపించదు ఎందుకంటే తమ కుటుంబంలో అందరం కూడా నవ్వకుండా ఇతరులను నవ్వించే అలవాటు ఉన్నది.. మా ఇంట్లో నాన్నగారి నుంచి ఇది కొనసాగుతూనే ఉందని తెలిపారు.

హీరో గానే కాకుండా ఆల్రౌండర్ గా అనిపించుకోవాలని అన్ని పాత్రలు చేశానని అలా ఎన్నో చిత్రాలలో నటించడం వల్ల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశాను ఆ నిర్లక్ష్యమే తన ఆరోగ్యాన్ని ఇప్పుడు ఇబ్బందులలో పడేసిందని తెలిపారు.. రాఖీ సినిమా సమయంలో బైపాస్ సర్జరీ చేయించుకున్నారని తెలిపారు. గతంలో కంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా పెరిగిందని ఆ విషయంలో కాస్త సంతోషంగా ఉందని తెలిపారు. తన జీవితానికి ఇది చాలని.. అయితే సినీ జీవితం తనకు చాలా నేర్పిందని.. పేరు, డబ్బు, బంధాలు శాశ్వతం కాదని నమ్మకద్రోహులకు సైతం దూరంగా ఉండాలని ఆర్థికంగా జాగ్రత్తగా ఉండకపోతే చాలా ప్రమాదమని సిని జీవితం తనకు నేర్పిందని తెలియజేశారు చంద్రమోహన్.