చంద్ర మోహన్ కి NTR అంటే ఎంత ఇష్టమో తెలుసా..? ఏ హీరోకి దక్కని అరుదైన అదృష్టం..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలు సీనియర్ నటుడుగా పేరు సంపాదించుకున్న చంద్రమోహన్ అనారోగ్య కారణంగా కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్  అపోలో హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ మరణించారు . సినిమా ఇండస్ట్రీకి ఎన్నో హిట్ సినిమాలను అందించి విశేష సేవలు అందించిన చంద్రమోహన్ మన మధ్య లేడు అని తెలుసుకున్న జనాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు . ఆయనతో వర్క్ చేసిన హీరో హీరోయిన్లు .. నటులు ఆయన మరణం పట్ల చింతిస్తూ సోషల్ మీడియా వేదికగా మెసేజెస్ పెడుతున్నారు .

అంతేకాదు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.  ఇలాంటి క్రమంలోనే  జూనియర్ ఎన్టీఆర్కి చంద్రమోహన్ కి మధ్య ఉన్న స్పెషల్ బంధం గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి . ఇండస్ట్రీలో ఎంతమంది యంగ్ హీరోలు ఉన్న చంద్రమోహన్ కి జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా చాలా ఇష్టం.  ఈ విషయాన్ని ఆయనే స్వయంగా పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు.

మరి ముఖ్యంగా వీళ్ళిద్దరి కాంబోలో వచ్చిన బాద్షా , రాఖీ సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అంతేకాదు వీళ్ళిద్దరి పర్ఫామెన్స్ కూడా ఈ సినిమాలో హైలెట్ గా మారింది.  నేటి ఇండస్ట్రీకి ఎన్టీఆర్ లాంటి హీరోలే కావాలి అంటూ చంద్రమోహన్ ఎన్నోసార్లు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు . అంతేకాదు హరికృష్ణకు ఎన్టీఆర్ అంటే ఎంత ఇష్టమో అదే రేంజ్ లో చంద్రమోహన్ కి కూడా ఎన్టీఆర్ అంటే ఇష్టం.  అంతేకాదు ఆయనకు కొడుకులు లేరు అన్న లోటును ఎన్టీఆర్ తీర్చేశాడు అని పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు . దీంతో ఇదే విషయం ట్రెండ్ చేస్తున్నారు నందమూరి అభిమానులు..!!