కె విశ్వనాధ్ కి చంద్ర మోహన్ తో ఉన్న సంబంధం ఏంటో తెలుసా..బయట పడ్డ ఎవ్వరికి తెలియని నిజం..!!

సినిమా ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి . ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన స్టార్ సెలబ్రిటీస్ ఒకరి తర్వాత ఒకరు మరణిస్తున్నారు. ఇది సినీ లవర్స్ కి తీవ్ర శోకాన్ని మిగిల్చింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటుడుగా పేరు సంపాదించుకున్న చంద్రమోహన్ కొద్దిసేపటి క్రితమే తుది శ్వాస విడిచారు . ఆయన వయసు 82..  గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.  హైదరాబాదులోని అపోలో హాస్పిటల్స్ లో చికిత్స తీసుకుంటున్న చంద్రమోహన్ ట్రీట్మెంట్ కి ఆయన బాడీ సహకరించ పోవడంతో పరిస్థితి విషమించి  చంద్రబాబు మరణించారు .

ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు అఫీషియల్ గా ప్రకటించారు . ఈ క్రమంలోనే పలువురు  సినీ ప్రముఖులు ఆయన మరణం పట్ల సంతాపం ప్రకటిస్తున్నారు.  కాగా ఇదే క్రమంలో కే విశ్వనాథ్ గారికి చంద్రమోహన్ గారికి మధ్య ఉన్న సంబంధం గురించి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.  ఈ సంవత్సరం ఫిబ్రవరిలోని కె విశ్వనాథ్ గారు మరణించారు. ఆయన చనిపోయినప్పుడు ఆయన ఇంటికి వెళ్లి కే విశ్వనాథ్  పార్థివ దేహం వద్ద చంద్రమోహన్ విలపించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .

కే విశ్వనాథ్ తనకు పెదనాన్న కొడుకు అవుతాడు అని చంద్రమోహన్ నే స్వయంగా వెల్లడించారు.  తన అన్నయ్య పార్థవదేహాన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. కే విశ్వనాథతో చంద్రమోహన్ కి ఉన్న విడదీయరాన్ని అనుబంధం గురించి స్వయాన ఆయన మీడియాకు వెల్లడించారు.  కే విశ్వనాధ్ కి ఒక కజిన్ బాలసుబ్రమణ్యం గారు అయితే మరొక కజిన్ నేనే.. మాది సినిమా బంధం కంటే చాలా స్ట్రాంగ్ ..కుటుంబ పరంగా మా బంధుత్వం చాలా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది . అందరికంటే నేనే ఆయనకు దగ్గర వాడిని ..మేమిద్దరం కలిసి ఒకే చోట్ల స్థలాలు ఇల్లులు కొనుక్కున్నాం.. 25 సంవత్సరాలు పక్కపక్కనే ఇళ్లల్లో ఉంటూ గడిపాం..నేను నటుడుగా ఎదగడానికి ఆయనే కారణం అంటూ చాలా ఎమోషనల్ అయ్యారు . దీనికి సంబంధించిన దృశ్యాలను మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు చంద్రమోహన్ అభిమానులు..!