టాలీవుడ్ టాలెంటెడ్ నటులలో సుహాస్ కూడా ఒకడు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈయన.. ఇప్పుడు హీరో గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. సుహాస్ నటిస్తే ఆ సినిమా మినిమం గ్యారెంటీ ఉంటుందని ఫ్యాన్స్ అభిప్రాయం. పోస్టర్ లో ఈయన ఫోటో చూస్తే చాలు థియేటర్ల ముందు క్యూ కడతారు. దీంతో స్టార్ నిర్మాతలు సైతం తనకు సినిమాలు చేయడానికి అవకాశం ఇస్తున్నారు.
అయితే సుహాస్ తాజాగా నటించిన మూవీ ” అంబాజీపేట మ్యారేజ్ బ్రాండ్ ” ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న సుహాస్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సుహాస్ మాట్లాడుతూ…” ఈ మూవీ కోసం చాలా కష్టపడ్డాను. ట్విస్టులు ఆసక్తికరంగా ఉంటాయి. అందరూ తప్పకుండా చూడండి.
ఎవరికి సక్సెస్ ఊరికే రాదు. రూ. 3 వేల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్న నేను.. ఇప్పుడు ఏకంగా రూ.3 లక్షలు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాను. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ కావాలి. మీరు ఈ సినిమాని ఆదరించి నన్ను సపోర్ట్ చేస్తారని నేను భావిస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ థిస్ మూవీ ” అంటూ చెప్పుకొచ్చాడు. ఈయన వ్యాఖ్యలపై స్పందిస్తున్న ప్రేక్షకులు…” నువ్వు ఇంకా పెద్ద సక్సెస్ దక్కించుకుని.. పెద్ద హీరో అవుతావు బ్రో. డోంట్ ఫియర్ ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.