టాలీవుడ్ సీనియర్ నటుడు చంద్రమోహన్ కొద్దిసేపటి క్రితమే మరణించారు . గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాదులోని అపోలో హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ శనివారం తుది శ్వాస విడిచారు. ఈ ఊహించని పరిణామం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు టాలీవుడ్ ప్రముఖులు.
కాగా చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర రావు. ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ గా మారిపోయారు ఈయన. కృష్ణాజిల్లా పమిడిముక్కలలో 23 మే 1945లో ఈయన జన్మించారు . మేడూరు , బాపట్లలో ఈయన చదువు ను కంప్లీట్ చేశారు. కే విశ్వనాథ్ గారికి చంద్రమోహన్ చాలా దగ్గర బంధువు.
1966 లో రంగులరాట్నం అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన చంద్రమోహన్ ఆ తర్వాత ఎన్నో ఎన్నో మంచి సినిమాలో నటించి సినిమా ఇండస్ట్రీకి విశేష సేవలు అందించారు . ఆయన లాస్ట్ గా నటించిన సినిమా గోపీచంద్ కెరియర్ లో డిజాస్టర్ గా నిలిచిన ఆక్సిజన్ మూవీ . ఈ సినిమా తర్వాత ఆయన సినిమాలకు దూరంగా ఉండిపోయారు .
ఆయన 55 ఏళ్ల సినీ కెరియర్ లో మొత్తం 932 సినిమాల్లో నటించారు. ఈయన నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అయినా.. ఆయన నటనకు మాత్రం మంచి మార్కులే దక్కాయి . సిరిసిరిమువ్వ ..శుభోదయం ..సీతామహాలక్ష్మి 16 ఏళ్ల వయసు ఈయన కెరియర్ లో మర్చిపోలేని సినిమాలు..!!