జెట్ స్పీడ్ లో కెరీర్ ముందుకు వెళ్తున్న టైం లో..చంద్ర మోహన్ సినిమాలు ఎందుకు ఆపేశారో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటుడుగా పాపులారిటీ సంపాదించుకున్న చంద్రమోహన్ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. కొద్దిసేపటి క్రితమే ఆయన మరణ వార్తను కుటుంబ సభ్యులు అఫీషియల్ గా ధ్రువీకరించారు. చంద్రమోహన్ అనారోగ్య కారణంగా హైదరాబాద్లోని అపోలో హాస్పిటల్లో గత కొంతకాలంగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.  అయితే మెడిసిన్స్ ఎంత వాడినా ఆయన ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో ట్రీట్మెంట్ కి ఆయన బాడీ స్పందించకపోవడంతో .. ఆయన తుది శ్వాస విడిచారు.

ఈయన మరణ వార్తను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు . టాలీవుడ్ ఇండస్ట్రీకి చంద్రమోహన్ ఎలాంటి పిల్లర్ అనే విషయం గుర్తు చేస్తున్నారు . కాగా సినిమా ఇండస్ట్రీలో ఎన్నో మంచి సినిమాలో నటించి టాలీవుడ్ కి విశేష సేవలు అందించిన చంద్రమోహన్ ఒకప్పటి యాక్టర్లతోనే కాదు నేటి కాలం యంగ్ జనరేషన్ తో  కూడా నటించారు .

సినిమాలలో కూడా కీలకపాత్రలో పోషించిన ఆయన కెరియర్ జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్నప్పుడే సినిమా ఇండస్ట్రీకి దూరమైపోయాడు . దానికి కారణం ఆయన బైపాస్ సర్జరీ చేయించుకోవడమే.. బైపాస్ సర్జరీ చేయించుకున్నాక డాక్టర్ సలహాల మేరకు ఆయన సినిమాలు చేయడం ఆపేశారు. ఆయన ఆఖరిగా నటించిన సినిమా గోపీచంద్ కెరీర్ లోనే డిజాస్టర్ గా మిగిలిన ఆక్సిజన్ . ఈ సినిమా తర్వాత ఆయన చలనచిత్ర పరిశ్రమకు దూరంగా ఉన్నారు . చంద్రమోహన్ మరణ వార్త ను జీర్ణించుకోలేకపోతున్నారు ఆయన అభిమానులు . ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలుపుతున్నారు..!!