యంగ్ బ్యూటీ అనన్య పాండే మనందరికీ సుపరిచితమే. అనన్య పాండే, ఆదిత్య రాయ్ కపూర్ తో ప్రేమలో ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. రీసెంట్ గా ” కాఫీ విత్ కరణ్ ” షో ద్వారా తన ప్రేమని ప్రకటించింది. అయితే ప్రస్తుతం ఆదిత్య లవ్ ను ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటీ.. మరో అచీవ్మెంట్ కూడా రీచ్ అయింది ” ధంతేరస్ ” సందర్భంగా అభిమానులకు శుభాకాంక్షలు చెబుతూ.. తను కొత్త ఇల్లు కొన్నట్లు తెలుపుతూ వీడియో షేర్ చేసింది.
గృహ ప్రవేశ పూజ చేస్తూ.. అందరి ఆశీర్వాదాలు కావాలని కోరింది. దీంతో ఫ్యాన్స్ సైతం కంగ్రాట్స్ చెబుతున్నారు. ” గ్రేట్ ఫుల్ ” గా ఫీల్ అవుతున్నామని మురిసిపోయారు తల్లిదండ్రులు. ఇక మరికొందరు ఈ దీపావళి బాగానే కలిసి వచ్చిందని కామెంట్స్ చేస్తున్నారు. ప్రియుడు, ఇల్లు రెండు కూడా ఎప్పటికీ తనతోనే ఉండాలని ఆశీర్వదిస్తున్నారు.
ఇక విజయ్ దేవరకొండ ‘ లైగర్ ‘ సినిమాతో సౌత్ ఇండియా ను పరిచయం చేసుకున్న ఈ బ్యూటీ.. రీసెంట్ గా ” డ్రీమ్ గర్ల్ 2 ” సినిమాతో భారీ సక్సెస్ అందుకుంది. ఇక కొత్త ఇల్లు కొన్న సందర్భంగా తన బాయ్ ఫ్రెండ్ తో వెకేషన్స్ వెళ్తూ ఎంజాయ్ చేస్తుంది. ఇవి చూసిన ప్రేక్షకులు…” ఈమె బాయ్ ఫ్రెండ్ కు పండగలో పండగ వచ్చిందిగా..” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.